వేడిగాలులతో తలనొప్పి వేధిస్తోందా?.. తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే సరి!

రోజు రోజుకూ ఎండలు మరింత పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా వేడిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతన్నారు. బయట తిరిగే వారు, జర్నీ చేసేవారు వేడిగాలుల ప్రభావానికి తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-05-03 09:39 GMT

దిశ, ఫీచర్స్ : రోజు రోజుకూ ఎండలు మరింత పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడమే కాకుండా వేడిగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతన్నారు. బయట తిరిగే వారు, జర్నీ చేసేవారు వేడిగాలుల ప్రభావానికి తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే దీని నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన ఉపశమన చర్యలు కొన్ని ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

సాధారణంగా ఒత్తిడి, వివిధ అనారోగ్యాలతో వచ్చే తలనొప్పి వేరు, ఎండవేడి వల్ల వచ్చే తలనొప్పి వేరు. ఎండలో బయట తిరగడంవల్ల కళ్లు తిరగడం, తలనొప్పి రావడం జరగవచ్చు. ఇలాంటి పరిస్థితిలో నీడలోకి చేరాక చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. అలాగే చల్లటి నీటిలో తడిపిన రుమాలుతో తల, నుదురు భాగాల్లో ప్రెస్ చేస్తూ ఉంటే వెంటనే ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు. అలాగే చల్లటి ఐస్ క్యూబ్స్‌ను కర్చీఫ్ లేదా పలుచటి టవల్లో పెట్టి తల భాగంలో స్మూత్‌గా రుద్దుతూ ఉంటే కూడా తలనొప్పి తగ్గుతుంది. అప్పటికీ తగ్గకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు.

వేడిగాలుల ప్రభావానికి, ఉక్కబోతలకు శరీరంలోని నీటిశాతం చెమట రూపంలో బయటకు పోతుంది. వేడిగాలులతోపాటు ఈ పరిస్థితి కూడా తలనొప్పికి కారణం అవుతుంది. కాబట్టి మెడ, నుదుటిపై కోల్డ్ కంప్రెస్ చేయడంవల్ల రక్త నాళాలు రిలాక్స్ అవుతాయి. డీహైడ్రేషన్ వల్ల ఏర్పడిన ఇబ్బంది, తలనొప్పి కూడా తగ్గుతాయి.

డీప్ బ్రీతింగ్స్, మెడిటేషన్, రిలాక్సేషన్, మెడ, భుజం వంటి భాగాల్లో మసాజ్ చేయడం వంటి టెక్నిక్స్ కూడా ఎండవల్ల వచ్చే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా తలనొప్పి నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తలో భాగంగా బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడటం, సన్‌ గ్లాసెస్ ధరించడం, సన్ స్ర్కీన్ అప్లయ్ చేయడం వంటివి కూడా మేలు చేస్తాయి. వేసవిలో టీ, కాఫీ వంటివి ఎక్కువసార్లు తాగడం ఫ్రైడ్ అండ్ స్పైసీ ఫుడ్స్ తినడంవల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మితంగా తాగడం, తినడం చేయాలి.

Similar News