రేపే రోహిణి కార్తె.. రోళ్లు పగిలేంత ఎండల ఎందుకు కొడుతాయి అంటారు!

మే 25 శని వారం నుంచి రోహిణి కార్తే ప్రారంభం కానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. అయితే మన పెద్దవారు అంటుంటారు. రోహిణి కార్తే వచ్చేసింది. ఇక రోకండలు పగిలే ఎండలు దంచికొడుతాయని. మరీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Update: 2024-05-24 05:44 GMT

దిశ, ఫీచర్స్ : మే 25 శని వారం నుంచి రోహిణి కార్తే ప్రారంభం కానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. అయితే మన పెద్దవారు అంటుంటారు. రోహిణి కార్తే వచ్చేసింది. ఇక రోకండలు పగిలే ఎండలు దంచికొడుతాయని. మరీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడూ లేని విధంగా ఈ కార్తెలోనే ఎండలు ఎందుకు ఎక్కువగా కొడుతాయో.. ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం.

రోహిణి కార్తె అనగా మే నెలలో సూర్య భగవానుడు మన నడి నెత్తి మీదకు వస్తాడంట. అంటే మాడు మధ్య భాగానికి వస్తాడు. అంతే కాకుండా చాలా ఉగ్రరూపంగా, చండ్ర ప్రచండుడుగా మారిపోయి, నిప్పులు కక్కుతూతాడంట. అవి భూమిని తాకగానే, భూమి మీద ఉన్న తేమ హరించుకపోతుంది. మొత్తం వేడిగా మారిపోతుంది. అంతే కాకుండా రాళ్లలో కూడా ఉండే కాస్త తేమ కూడా ఇంకి పోయి రోళ్లకు పగులు వస్తాయి అంటున్నారు కొందరు. అందువలన ఈ కాలం రాగానే రోళ్లు పగులుతాయి అంటారంట.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక్కో నక్షత్రం నుంచి మారుతాడు. అయితే సూర్య భగవానుడు రోహిణి నక్షత్రం వద్దకు రావడాన్ని రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో సూర్యుడు తన ప్రభావాన్ని చూపెడుతాడు. అందుకే ఈ కార్తెలో ఎండలు విపరీతంగా మండుతాయనడానికి బదులు రోహిణి కార్తె కాలంలో రోళ్లు పగలుతాయని చెబుతారు.

అంతే కాకుండా ఈ 15 రోజుల్లో తీవ్రమైన ఎండ, వడగాలులు, అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయని, అందువలన ప్రజలందరూ ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మట్టికుండ నీళ్ళు తాగడం,మజ్జిగా,పండ్ల రసాలు,కొబ్బరినీళ్ళు,నిమ్మరసం,రాగి జావ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండటం వలన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఈ రోజుల్లో మసాలా ఫుడ్, వేపుళ్ళు ,పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్‌కు దూరంగా ఉండటమే మంచిదంట.

( నోట్ : ఇది ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)

Similar News