బంగాళ దుంప తిన్న తర్వాత మన శరీరంలో జరిగేది ఇదే..!

బంగాళదుంప కూరను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు.

Update: 2024-05-26 06:12 GMT

దిశ, ఫీచర్స్ : బంగాళదుంప కూరను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ దుంపలతో అన్ని రకాల వంటకాలను చేసుకోవచ్చు. కూరలు, వేపుళ్లు ఇలా ఏది తయారు చేసినా రుచిగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా వినియోగించే ఆహారాలలో దుంపలు ఒకటి. ఏ కాలంలో అయినా అతిగా ఇష్టపడి తినే వాటిల్లో ఆలూ కూడా ఉంటుంది.

దుంపలలో అనేక పోషకాలు ఉంటాయి. పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బంగాళాదుంపలు తినడం వల్ల గుండె జబ్బులు, అకాల మరణాల ముప్పు తగ్గుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ దుంపలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వలన మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అదేవిధంగా, గుండె సమస్యలతో బాధపడేవారు ఆలూ ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వారి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ దుంపలో ఫైబర్‌తో పాటు కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అదే విధంగా ఆలు గడ్డలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల మల బద్ధకం తగ్గుతుంది.

Similar News