పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం.. పిల్లలు తినకూడని టాప్ 5 వరెస్ట్ ఫుడ్స్ ఇవే

పిల్లల్నీ పెంచడం ప్రతి తల్లీదండ్రులకు పెద్ద టాస్క్.

Update: 2024-05-07 14:31 GMT

దిశ, ఫీచర్స్: పిల్లల్నీ పెంచడం ప్రతి తల్లీదండ్రులకు పెద్ద టాస్క్. వాళ్లు ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. తినేందుకు ఏం కోరుకుంటారో తెలియదు. కానీ వాళ్లు ఏది కోరిన అది తక్షణమే తెచ్చి పెట్టాలి అంటారు. లేదంటే ఇళ్లు పీకి పందిరి వేస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది పేరెంట్స్ వాళ్ల గోల తట్టుకోలేక ఏది అడిగితే అది ఇస్తారు. తినేందుకు కూడా ఏం అడిగిన అది తెచ్చి పెడతారు. కానీ పిల్లలకు అవి మంచిదా కాదా అని ఒక్క క్షణం ఆలోచించరు. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లలు పేరెంట్స్ అతి ప్రేమ కారణంగా జంక్ ఫుడ్స్‌కు అలవాటు పడతారు. అంతే కాకుండా వాటి వల్ల వారి ఆరోగ్యం కూడా పాడవుతోంది. అయితే.. డాక్టర్స్ సూచనల మేరకు పిల్లలకు ఈ టాప్ 5 వరెస్ట్ ఫుడ్స్ అస్సలు పెట్టకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుదాం...

* మ్యాగీ, ఇప్పి లాంటివి ప్రోసెస్ ఫుడ్ కాబట్టి పిల్లలకు పెట్టకపోవడమే మంచిదని చెబుతున్నారు.

* కూల్ డ్రింగ్స్ కూడా పిల్లలకు మంచిది కాదు.

* చాక్లెట్స్ కూడా చిన్నపిల్లల హెల్త్‌కు అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* అన్నిటికంటే ముఖ్యమైనది బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్. వీటి వల్ల చిన్న పిల్లల హెల్త్ పాడవ్వమే కాకుండా కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తుంది. సోయా సాస్ ఎక్కువగా వాడే పదార్ధాలు కూడా తీసుకోకుండా ఉంటే మంచిది.

* ఇక 5వ అతి ముఖ్యమైనది కేఎఫ్‌సీ, మెక్‌డోనల్డ్ వంటివి పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మందని చెబుతున్నారు నిపుణులు.

ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో మొత్తానికే తినకుండా పిల్లల్నీ ఆపలేము. కానీ వీలైనంత ఎక్కువగా తినకుండా చూసుకుంటే వారి హెల్త్‌కి మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. 

Similar News