కుక్కల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి విమానయాన సంస్థ.. ఇక ఎక్కడికెళ్లినా శునకాలు మీ వెంటే..

ప్రస్తుత రోజుల్లో మనుషుల మధ్య ఆప్యాయతలు కరువయ్యాయి.

Update: 2024-05-27 08:39 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో మనుషుల మధ్య ఆప్యాయతలు కరువయ్యాయి. అదే సమయంలో పెంపుడు జంతువులతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని ధనిక వర్గాల వ్యక్తులు పెట్ డాగ్స్ ను నిమిషమైనా విడిచి ఉండలేని పరిస్థితి. ఈ మేరకు ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు మిస్సయిన ఫీలింగ్స్ ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి విమానాల్లో పెట్ డాగ్స్ ను తీసుకెళ్లే విషయంలో ఉన్నటువంటి పరిమితులు ఒకింత కష్టంగా మారాయి. ఈ నేపథ్యంలోనే బార్క్ ఎయిర్ అనే ఎయిర్ లైన్ సంస్థ పెంపుడు శునకాల కోసం ప్రత్యేక ప్రయాణ అవకాశాలను కల్పించేందుకు సిద్ధమైంది.

Bark Air అనేది కుక్కల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి ఎయిర్‌లైన్ సంస్థ. ఇది పెట్ డాగ్స్ ను వాటి యజమానులతో కలిసి సౌకర్యవంతంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సర్వీస్ వైట్ పావ్ సర్వీస్ తో పాటు కుక్కలకు విందులు, ఇయర్‌మఫ్‌లు, పానీయాలను అందిస్తుంది. ఇక్కడ శునకం పరిమాణం లేదా జాతిపై ఎటువంటి పరిమితులు లేవు

బొమ్మల కంపెనీ అయిన BARK సంస్థ.. ఒక జెట్ చార్టర్ సర్వీస్ భాగస్వామ్యంతో కలిసి బార్క్ ఎయిర్ లైన్ ను ప్రారంభించింది. ఈ మేరకు న్యూయార్క్ నుండి లాస్ ఏంజిల్స్‌కు గురువారం ఈ విమానయాన సంస్థ నుంచి బయలుదేరిన మొదటి విమాన వివరాలను పంచుకుంది.

గతంలో మాదిరి కాకుండా తమ విమానయాన సంస్థ కుక్కలను కార్గోగా లేదా సిబ్బందికి, తోటి ప్రయాణికులకు భారంగా భావించడం లేదని పేర్కొంది. ఇక్కడ, కుక్కలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. తమ ఈ ప్రయత్నానికి 10 సంవత్సరాలు పట్టిందని చెపోయినా బార్క్ ఎయిర్.. పెంపుడు శునకాలకు అర్హమైన విమాన ప్రయాణ అనుభవాన్ని అందించగలమని హామీ ఇచ్చింది.

Similar News