అప్పటిదాకా ఇంగ్లీష్ ముక్కరాని వ్యక్తికి కూడా మందు కొట్టగానే ఎందుకని వస్తుంది?

మీరెప్పుడైనా గమనించారా?.. అప్పటి దాకా సైలెంట్‌గా ఉండే ఒక వ్యక్తి మద్యం తాగిన తర్వాత వింతగా ప్రవర్తిస్తుంటాడు. మామూలు సమయంలో ఏబీసీడీలు కూడా పలకలేని వ్యక్తి నోట్లో చుక్క పడ్డాక అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాడు.

Update: 2024-05-23 06:40 GMT

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా గమనించారా?.. అప్పటి దాకా సైలెంట్‌గా ఉండే ఒక వ్యక్తి మద్యం తాగిన తర్వాత వింతగా ప్రవర్తిస్తుంటాడు. మామూలు సమయంలో ఏబీసీడీలు కూడా పలకలేని వ్యక్తి నోట్లో చుక్క పడ్డాక అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాడు. మత్తులో ఉన్నవారు అన్నీ నిజాలే చెప్తారని కూడా అంటుంటారు. అయితే ఎందుకిలా జరుగుతుంది? మద్యానికి అంత పవర్ ఉందా? దీని వెనుక గల అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

యూనివర్సిటీ ఆఫ్ లివర్ పూల్ అండ్ మాస్ట్రిక్ట్ యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన నిపుణులు మద్యం వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడంలో భాగంగా పలువురిపై అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మద్యం తాగినప్పుడు శరీరానికి మత్తు వ్యాపించడమే కాకుండా, దానివల్ల వారిలో తెగింపు, ధైర్యం, విశ్వాసం వంటివి ఎక్కువ అవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు కారణం డ్రింక్ చేశాక బాడీలో విడుదలయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజ పరుస్తాయి.

సాధారణ సమయాల్లో వ్యక్తులు బయటి పరిసరాల నుంచి, సమాజం నుంచి గ్రహించిన, బయటకు చెప్పుకోలేని విషయాలను మనసులో దాచుకొని ఉంటే గనుక, మద్యం తాగినప్పుడు వాటిని బయటకు చెప్పేస్తుంటారు. మద్యం మత్తు మెదడు కణాలను ప్రభావితం చేయడం కారణంగా జరిగే రసాయనిక చర్యలవల్ల లభించే ప్రేరణ, ఏర్పడే విశ్వాసం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా మద్యం మత్తు బ్రెయిన్ యాక్టివిటీస్‌లో క్రియాశీలతను తగ్గిస్తుంది. తాగిన మోతాదును బట్టి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం తాగిన వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తుంటారు. వచ్చీ రాని ఇంగ్లీష్‌ అయినా సరే ధైర్యంగా, అనర్గళంగా మాట్లాడేస్తుంటారు.

Similar News