మద్యం తాగే మహిళలను బయపెడుతున్న తాజా అధ్యయనం.. ఈ నిజాలు తెలిస్తే అంతే..?

ఈ మధ్య కాలంలో ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలుగా మారుతున్నారు.

Update: 2024-05-09 09:43 GMT

దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలుగా మారుతున్నారు. దీంతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతే కాకుండా కొంత మందికి లివర్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం హార్ట్ స్ట్రోక్ వంటివి రావడంతో మృత్యువాత పడుతున్నారు. ఇక కొంత మంది మహిళలు అయితే చెప్పాల్సిన పని లేదు. వారు పురుషులకు మించి మద్యపానం చేస్తారు. అలాంటి వారికి తాజా అధ్యయనం షాకిచ్చిందనే చెప్పాలి.

అయితే ఇప్పటి వరకు మద్యం సేవించే వాళ్లపై ఎన్నో అద్యయనాలు చేశారు. మద్యం సేవించని వారికి సేవించే వారికి జీవిత కాలంలో తేడాలు గురించి తెలిపారు. కానీ తాజాగా చేసిన అద్యయనం ప్రకారం.. ఈ మద్యం ఎఫెక్ట్ పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ ఉంటుందని తేలింది. అంటే ఒక పురుషుడు ఒకేసారి 5 డ్రింక్స్, ఒక మహిళ ఒకేసారి 4 డ్రింక్స్ తీసుకుంది అనుకుంటే.. లెక్కపక్రారం పురుషుడు ఎక్కువ తాగినట్టు. కానీ ఆధారాలు ప్రకారం మహిళ ఎక్కువగా తాగినట్లు అవుతోంది. ఈ మేరకు ఇటీవల, ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై ఒక అధ్యయనం జరిగింది. ఈ అద్యయనం ప్రకారం మోతాదుకు మించి తాగిన మహిళ్లల్లో ఎక్కువగా గుండె జబ్బుల వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తేలింది.

ఇక సాధారణంగా పురుషులు వారానికి 3 నుంచి 14 పెగ్గులు వరకు తీసుకుంటే అది మితం. అయితే.. మహిళలు మాత్రం 3 నుంచి 7 పెగ్గులు తీసుకున్నట్లు అయితేనే వారు మద్యం మితంగా సేవిస్తున్నట్లు. అది దాటితే వారు ఎక్కువగా మందు తాగుతున్నారని అర్థం వస్తుంది. అంటే వారానికి 8 కంటే ఎక్కువ మద్యం సేవించే మహిళల్లో 33 నుండి 51 శాతం ఎక్కువ గుండె జబ్బుల ముప్పును కలిగి ఉన్నారు. దీనిపై రీసెర్చ్ జిరిపిన డాక్టర్లు మాట్లాడుతూ.. ‘ఈ ఫలితాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి. చిన్న వయస్సులో ఉన్న మహిళలు కూడా తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నేను ఊహించలేదు.. ఎందుకంటే ఇది వృద్ధ మహిళల్లో తరచుగా కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. 

Read More...

అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీళ్లు తాగిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. 

Similar News