Viral Video: వెరైటీ టాయిలెట్.. లోపల ఏం చేసేది బయటకు కనిపిస్తుంది.. అయినా ఎవరూ సిగ్గుపడరు!

టాయిలెట్స్ ఎక్కడ నిర్మించినా ప్రజలు వాటిని గుర్తించేలా ‘గోడపై పబ్లిక్ టాయిలెట్’ అని రాయడమో బోర్డు పెట్టడమో చేస్తుంటారు. వాటి లోపలి భాగం వినియోగదారులకు ప్రైవేటు ప్లేస్ కాబట్టి స్త్రీ, పురుషులకు వేర్వేరుగా సూచిక బోర్డులు కూడా కనిపిస్తుంటాయి.

Update: 2024-05-23 07:52 GMT

దిశ, ఫీచర్స్ : టాయిలెట్స్ ఎక్కడ నిర్మించినా ప్రజలు వాటిని గుర్తించేలా ‘గోడపై పబ్లిక్ టాయిలెట్’ అని రాయడమో బోర్డు పెట్టడమో చేస్తుంటారు. వాటి లోపలి భాగం వినియోగదారులకు ప్రైవేటు ప్లేస్ కాబట్టి స్త్రీ, పురుషులకు వేర్వేరుగా సూచిక బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. కానీ ఒక దగ్గర మాత్రం ఇందుకు భిన్నంగా నిర్మించారు. టాయిలెట్ రూమ్‌ లోపలి భాగం కూడా బయటి వ్యక్తులకు కనిపించేలా మొత్తం గాజు అద్దాలతో నిర్మించారు.అయినా అందరూ ఆ టాయిలెట్‌ను యూజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో ఉన్నదాని ప్రకారం.. లైట్ కలర్ ట్రాన్స్ పరెంట్ గ్లాసెస్‌తో నిర్మించిన సదరు టాయిలెట్ జపాన్‌లోని షిబుయా హరు-నో-ఒగావా ప్లే పార్క్‌లో ఉంది. సాధారణంగా దాని లోపలి భాగంలో ఎవరు ఉన్నది, ఏం చేస్తున్నది బయటకు కనిపించినప్పటికీ, దానిని వినియోగించునే సమయంలో మాత్రం అక్కడున్న ఒక బటన్ నొక్కితే చాలు ట్రాన్స్ పరెంట్ బ్లైండ్‌గా మారుతుందట. దీంతో లోపల ఉన్నవారు బయటి దృశ్యాన్ని, బయట ఉన్నవారు లోపలి దృశ్యాన్ని ఆ కొద్దిసేపు చూడలేరు. మళ్లీ డోర్ తెరవగానే ఎప్పటిలాగా దృశ్య మానంగా మారుతుంది. అయితే పలువురు ఏమాత్రం సిగ్గు పడకుండా ట్రాన్స్ పరెంట్ బ్లైండ్ బటన్ నొక్కకుండానే వాడేస్తుండటంతో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ప్రజెంట్ ఈ వీడియో yefactsofficial అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి అవసరమా?.. అంటూ కొందరు, వెరైటీగా ఉందంటూ ఇంకొందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Full View

Similar News