Viral : మనిషి మలానికి రూ.1.40 కోట్లు.. భారీ ఆఫర్ ప్రకటించిన ఓ కంపెనీ!

కాస్త డీప్‌గా ఆలోచించి చూడాలే కానీ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్థం ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. కానీ మనిషి మలంవల్ల కూడా అలాంటి బెనిఫిట్ ఒకటి ఉంటుందని చాలా మంది ఊహించి ఉండరు.

Update: 2024-05-24 07:16 GMT

దిశ, ఫీచర్స్ : కాస్త డీప్‌గా ఆలోచించి చూడాలే కానీ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్థం ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెప్తుంటారు. కానీ మనిషి మలంవల్ల కూడా అలాంటి బెనిఫిట్ ఒకటి ఉంటుందని చాలా మంది ఊహించి ఉండరు. కానీ ప్రస్తుతం అదే జరిగింది. మానవ విసర్జితం కాసులు కురిపిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. మానవ మలాన్ని కొంటామని, ఎవరైనా శాంపిల్స్ పంపిస్తే డబ్బులు చెల్లిస్తామని ఓ సంస్థ కోట్లాది రూపాలయల ఆఫర్ ప్రకటించిన వార్త ఒకటి ప్రజెంట్ వైరల్ అవుతోంది.

సాధారణంగా రోగ నిర్ధారణలు, వైద్య పరిశోధనల నిమిత్తం కంపెనీలు మానవుల నుంచి రక్తం, మూత్రం, స్వేదం వంటి శాంపిల్స్ సేకరిస్తుంటాయి. కొన్నిసార్లు వ్యర్థాలు, విసర్జితాలను కూడా పరిశోధకులు ల్యాబుల్లో పరీక్షిస్తుంటారు. ఇదంతా కామన్. కానీ రీసెంట్‌గా ఓ సంస్థ చాలా ముఖ్యమైన ప్రయోగం కోసం మనుషుల మలాన్ని పరీక్షించాలాని డిసైడ్ అయింది. అందుకోసం మల విసర్జితాల శాంపిల్స్ పంపించాలని (Stool samples) పబ్లిక్‌ను రిక్వెస్ట్ చేస్తోంది.

ప్రపంచ వైద్య రంగ చరిత్రలో ఇప్పటి వరకు అనేక మార్పులు వచ్చాయి. ఆధునిక రోగ నిర్ధారణ పరికరాలు, చికిత్సలు ప్రస్తుతం ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాగే అంతుపట్టని విషయాలు కూడా మరెఎన్నో ఉన్నాయి. సాధారణంగా పలు రకాల వ్యాధులకు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు కారణం అవుతుంటయి. అయితే కొంతమంది పేగుల్లో ఉండే ఒకే రకమైన రోగకారక బ్యాక్టీరియాలో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటున్నట్లు వైద్య పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. కానీ అలా ఎందుకు ఉంటాయనేది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే అవి ఆహారం, గట్ బ్యాక్టీరియాను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) అనే ఓ సంస్థ మానవ విసర్జితాలను పరీక్షించాలని టెస్టు చేయాలని నిర్ణయించడంతోపాటు భారీగా డబ్బులు కేటాయించి మలాన్ని కొనుగోలు చేస్తోంది.

ఎవరైనా సరే తమ మలాన్ని శాంపిల్ రూపంలో పంపిస్తే ఒక శాంపిల్‌కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తామని హ్యూమన్ మైక్రోబ్స్(Human Microbes) అనౌన్స్ చేసింది. అలాగే డైలీ మల విసర్జన శాంపిల్స్ పంపేవారికైతే సంవత్సరానికి రూ.180,000 డాలర్లు (దాదాపు రూ.1 కోటి 40 లక్షలు) ఇస్తామని, వరల్డ్ వైడ్ ఎవరైనా తమ మలాన్ని డొనేట్ చేయవచ్చునని తెలిపింది. పైగా తాము ఇచ్చే రేట్ ఎవరికైనా నచ్చకపోతే సొంతంగా రేట్ ఫిక్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. అయితే మనిషి మలంలో ఉండే హోస్ట్ - నేటివ్ మైక్రోబ్ (Host-native bacteria) అనే అత్యంత ముఖ్యమైన బ్యాక్టీరియాను కనుగొనడానికే ఇదంతా చేస్తోందని తెలుస్తోంది. ఇది కేవలం 0.1 % మంది ప్రజల మలంలోనే మాత్రమే ఉండే అరుదైన బ్యాక్టీరియా. అందుకే కంపెనీ ఇంత భారీ ఆఫర్ ప్రకటించింది ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హ్యూమన్ మైక్రోబ్స్ వెబ్‌సైట్ ప్రకటించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాలకోసం ఆరా తీస్తున్నారు.

నోట్ : పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు, సందేహాల విషయంలో ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. 

Similar News