ఏం చేసినా ఎక్కిళ్లు ఆగడం లేదా? అయితే ఈ టిప్స్ మీకోసమే!

ఎక్కిళ్లు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికీ ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే కొంత మందికి చాలా సేపటి వరకు ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక అవి ఆగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు

Update: 2024-05-01 07:58 GMT

దిశ, ఫీచర్స్ : ఎక్కిళ్లు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరికీ ఎక్కిళ్లు వస్తుంటాయి. అయితే కొంత మందికి చాలా సేపటి వరకు ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక అవి ఆగిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మన పెద్దవారైతే నీళ్లు ఎక్కువగా తాగండి ఎక్కిళ్లు ఆగిపోతాయని చెప్తారు అంతే కాకుండా మనల్ని భయానికి గురి చేయడం లాంటి విషయాలు చెప్పి ఎక్కిళ్లు ఆగిపోయేలా చేస్తారు. కొంత మందికి అలా చేయడం వలన ఎక్కిళ్లు అనేవి ఆగిపోయినా.. కొందరిలో అలా చేసినా కూడా ఎక్కిళ్లు అనేవి ఆగవు. అంతే కాకుండా కొందరికి పదే పదే ఎక్కిళ్లు వస్తూనే ఉంటాయి. అయితే తరచూ ఎక్కిళ్లతో బాధపడేవారు, ఆ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం అందరికీ తెలిసిందే. అయితే తరచూ ఎక్కిళ్లతో బాధపడే వారు కాస్త బెల్లం ముక్కను తీసుకొని నోట్లో వేసుకోవడం లేదా బెల్లం నీటిని తాగడం వలన ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు.అంతే కాకుండా ఎక్కిళ్లు వచ్చే వారు కూల్ వాటర్ తాగడం లేదా కూల్ డ్రింక్స్ తాగడం చేస్తుంటారు. అయితే అది చాలా ప్రమాదమంట. దీని వలన సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది వారు చెబుతున్నారు. సులభంగా ఎక్కిళ్లన నుంచి ఉపశమనం పొందాలంటే, కూల్ వాటర్ పక్కన పెట్టి నార్మల్‌గా శుభ్రమైన నీటిని తీసుకోవడం మంచిదంట. ముఖ్యంగా నీటిని తాగిన ఈ సమస్య నుంచి విముక్తి లభించకపోతే, రెండు పెద్ద గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల సులభంగా ఎక్కిళ్లు ఆగిపోయే అవకాశాలున్నాయి. అలాగే ముక్కును మూసుకొని నోటి నుంచి శ్వాస తీసుకోవడం వలన కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చునంట. మరీ ముఖ్యంగా నిరతరం ఈ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయడం వలన దీనిని నుంచి పూర్తిగా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.


Similar News