విడాకులు కావాలా.. అయితే ఈ గుడికి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం ఎక్కడైనా సరే ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. చిత్ర పరిశ్రమలో చాలా మంది విడిపోతున్నారు. అంతే కాకుండా ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుందంటున్నారు

Update: 2024-04-28 15:57 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడైనా సరే ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. చిత్ర పరిశ్రమలో చాలా మంది విడిపోతున్నారు. అంతే కాకుండా ఈ మధ్య విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుందంటున్నారు నిపుణులు. అయితే కొంత మంది ఎంత ప్రయత్నించినా విడాకులు తీసుకోలేరు. ఎందుకంటే వారి బంధం అంత బలమైనది కాబట్టి. దీంతో వారు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసి పోతుంటారు. అయితే అలాంటి వారి కోసం అదిరిపోయే న్యూస్.. అది ఏమిటంటే?

ఏదైనా కోరుకుంటే ఆ దేవుడి దగ్గరకు వెళ్తే నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. సంతానం లేని వారు ఆ గుడికి వెళ్తే సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారు ఆ దేవుడి ఈ మొక్కు చెల్లిస్తే పెళ్లి జరుగుతుంది ఇలా ఎన్నో విని ఉంటారు. కానీ విడాకుల ఆలయం గురించి ఎక్కువగా విని ఉండం. అయితే ఇప్పుడు చెప్పుకునేది దీని గురించే.

విడాకులు కావాలి అనుకునే వారు ఆ ఆలయానికి వెళ్తే వెంటనే విడాకుల వస్తాయని అక్కడి వారు నమ్ముతారు. జపాన్‌లోని కుమకురా నగరంలోని ఓ ఆలయం, గృహహింసకు గురైన మహిళలకు న్యాయం చేసే నిలయంగా నిలుస్తుందంట మత్సుగోకా టోకీ-జీ అనే ఆలయం. కకుసన్-ని అనే సన్యాసి తన భర్తతో సంతోషంగా జీవించలేదు. దీంతో ఆమె తనకు భర్త నచ్చక పోవడంతో విడాకులు తీసుకుందాం అనుకుంది. కానీ దానికి ఎలాంటి మార్గం దొరకకపోవడంతో ఆమె ఆలయాన్ని నిర్మించిందని, విడాకులు తీసుకోవాలనుకునే మహిళలు ఈ ఆలయంలోకి వెళ్లి మూడు సంవత్సరాలు గడపాలంట. ఆ తర్వాత విడాకులు తీసుకొవచ్చునంట. అలా దీనికి విడాకుల ఆలయం అని కూడా పేరు వచ్చినట్లు సమాచారం.

Similar News