వివాహ వేడుకకు వింత నియమాలు.. ఇంత కఠినమా? వైరల్‌గా మారిన ఇన్విటేషన్ కార్డ్

వధూవరులు ఎవరైనా తమ పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుంచుకునేలా ప్లాన్ చేసుకుంటారు.

Update: 2024-05-27 09:39 GMT

దిశ, ఫీచర్స్: వధూవరులు ఎవరైనా తమ పెళ్లి వేడుకను జీవితాంతం గుర్తుంచుకునేలా ప్లాన్ చేసుకుంటారు. అతిథులకు మర్యాదల దగ్గరి నుంచి ప్రతి చిన్న విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడో జంట మాత్రం తమ వివాహ వేడుక కోసం 15 రూల్స్‌తో గెస్టులకు పంపిన ఇన్విటేషన్ నెట్టింట వైరల్‌గా మారింది. వివాహానికి హాజరయ్యే అతిథులు వధూవరులు డామినేట్ చేయకుండా నలుపు లేదా బంగారం రంగు దుస్తులు మాత్రమే ధరించాలని వెల్లడించారు.  అలాగే రాత్రంతా కూర్చోకూడదని.. వారి అభిప్రాయాలను తమలో తాము ఉంచుకోవాలని అలాగే బయటి నుండి మద్యాన్ని వేదిక వద్దకు తీసుకురాకూడదని జాబితాలో పేర్కొన్నారు.

ఇందులో చాలా నియమాలు కరెక్ట్‌గా భావించబడుతున్నప్పటికీ, ఇందుకోసం వాడిన భాష మాత్రం అస్సలు బాలేదు. ఇక తాము ఒక పద్ధతి ప్రకారం సిటింగ్ అరేంజ్మెంట్స్ చేసినందునా.. అతిథులు ఫోటోగ్రాఫర్‌ల దారిలోకి అడ్డుగా రావద్దని, కుర్చీలను మళ్లీ అమర్చవద్దని కూడా సూచించారు. కాగా ఈ రూల్స్ పట్ల నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. అతిథుల సంఖ్యను తగ్గించుకునేందుకే వారు ఇలాంటి రూల్స్ క్రియేట్ చేసుకున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More...

వామ్మో! పెళ్లికి ముందే ఇంత ఫాస్టా?.. పీటల మీదే ఆ పని కానిచ్చేసిన వధువు.. (వీడియో)

Similar News