పాలపుంతలో మరో వింత.. 55 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

అంతరిక్ష రహస్యాలు, ఖగోళ అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక విషయాలను ఛేదించారు. అయినప్పటికీ, మనకు తెలియని ఇంకెన్నో అద్భుతాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయని ప్రతి కొత్త ఆవిష్కణ సందర్భంగా వెల్లడవుతూనే ఉంది.

Update: 2024-05-22 13:06 GMT

దిశ, ఫీచర్స్ : అంతరిక్ష రహస్యాలు, ఖగోళ అంశాలకు సంబంధించి శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక విషయాలను ఛేదించారు. అయినప్పటికీ, మనకు తెలియని ఇంకెన్నో అద్భుతాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయని ప్రతి కొత్త ఆవిష్కణ సందర్భంగా వెల్లడవుతూనే ఉంది. తాజాగా మరో అంశంతో మన ముందుకు వచ్చారు బెల్జియంలోని యూనివర్సిటీ ఆఫ్ లీజ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు.

‘స్పెక్యులూస్’ ప్రత్యేకత

మన పాలపుంతలోని గ్రహాలు, నక్షత్రాలపై చేస్తున్న రీసెర్చ్‌లో భాగంగా అంతరిక్ష పరిశోధకులు మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దాదాపు భూమి సైజులో ఉన్న ఈ ప్లానెట్‌కు స్పెక్యులూస్-3బి (Speculoos-3b) అని పేరు పెట్టారు. విషయం ఏంటంటే.. స్పెక్యులూస్ అనేది బెల్జియం దేశానికి చెందిన ఒక పాపులర్ బిస్కెట్ పేరట. శాస్త్రవేత్తలు కొత్త ప్లానెట్‌కు ఈ పేరు ఎందుకు పెట్టారంటే.. దానిని ‘Search for Planets అనే EClipsing ULtra-cOOl Stars) రోబోటిక్ టెలిస్కోప్ నెట్ వర్క్ ద్వారా కనుగొన్నారు. అది ఆ బిస్కెట్ ఆకారంలో ఉండటంవల్ల ఆ పేరు పెట్టారు.

సూర్యుడి వాతావరణానికి భిన్నంగా..

స్పెక్యులూస్ ప్రాజెక్ట్‌లో భాగంగా సైంటిస్టులు రెడ్ డ్వార్ఫ్స్, బ్రౌన్ డ్వార్ఫ్స్ వంటి అల్ట్రాకూల్ నక్షత్రాల చుట్టూ ఉండే రాక్ ఎక్సోప్లానెట్స్‌ను కనుగొనడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంలో కనుగొన్న కొత్త గ్రహానికి స్పెక్యులూస్ -3బిగా పేరు పెట్టారు. కాగా ఇది భూమికి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా (రెడ్‌ డ్వార్ఫ్‌ స్టార్‌) వాతావరణం సూర్యుడి వాతావరణంకంటే తక్కువ వేడిగా ఉంటుందట. మరో విషయం ఏంటంటే.. ఈ గ్రహంపై ఒక వైపు ఎప్పటికీ పగలు, మరో వైపు ఎప్పటికీ రాత్రి వేళలు కొనసాగుతాయని పరిశోధకుడు మైఖేల్ గిల్లాన్ పేర్కొన్నాడు.

జీవం ఏర్పడే అవకాశం లేదు

భూమిసైజు కొత్త గ్రహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి కావచ్చు. కానీ అటువంటి మరిన్ని గ్రహాలను శాస్త్రవేత్తలు గతంలోనూ గుర్తించారు. 2000 సంవత్సరంలో అంతరిక్ష పరిశోధకులు ఏడు గ్రహాలతో కూడిన ఒక చల్లని రెడ్‌ డ్వార్ఫ్‌ స్టార్‌ TRAPPIST-1ని కనుగొన్నారు. ఇది భూమికి 40.66 కాంతి సంవత్సరాల దూరంలో ఉండగా, ఇది సౌర వ్యవస్థకంటే పాతదని, 7.6 బిలియన్ సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. ఆ తర్వాత ఇప్పుడు స్పెక్యులూస్ -3బిని కనుగొన్నారు. ఇలా మన గెలాక్సీలో మొత్తం 70 శాతం ఎర్రటి మరగుజ్జు నక్షత్రాలు (రెడ్ డ్వార్ఫ్ స్టార్స్) 70 శాతం ఉన్నట్లు సైంటిస్టులు చెప్తు్న్నారు. అయితే ఇప్పుడు గుర్తించిన స్పెక్యులూష్-3బి మరో రెడ్ డ్వార్ఫ్ స్టార్‌కు చాలా దగ్గరగా ఉన్నందున దీనిపై జీవం ఏర్పడటం అసంభవం.

Similar News