ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని అరికట్టే పచ్చి మామిడి

మామిడి కాయలు లేదా పండ్లు వేసవిలో మాత్రమే లభిస్తాయి..

Update: 2023-03-13 05:27 GMT

దిశ, ఫీచర్స్: మామిడి కాయలు లేదా పండ్లు వేసవిలో మాత్రమే లభిస్తాయి. చాలామంది పచ్చిమామిడి కాయలను కోసి, దానిపై లైట్‌గా ఉప్పు, కారం చల్లి తినడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి చాలామంచిది. జీర్ణ సంబంధిత సమస్యలను పోగొట్టే లక్షణం ఇందులో ఉంటుంది. అంతేగాక విటమిన్ బి, నియాసిన్, ఫైబర్ పుష్కలంగా ఉండటంవల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు చెప్తున్నారు. శరీరంలో బ్లడ్ సర్క్యూట్ సరఫరా సక్రమంగా జరగడంలోనూ సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిది. నోటి దుర్వాసనను, చిగుళ్ల తరచూ రక్తం కారే సమస్యను పచ్చిమామిడి నివారిస్తుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని అరికడతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

Read more:

Fate: మనిషికి మంచి చెడులన్నీ ఎలా జరుగుతాయో తెలుసా?

Tags:    

Similar News