ఒక్క గంట నిద్ర డిస్టర్బ్ అయితే.. నాలుగు రోజులు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిందే..

మనిషికి ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా అవసరమని చెప్తుంటారు నిపుణులు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా స్లీప్

Update: 2024-05-24 05:21 GMT

దిశ, ఫీచర్స్ : మనిషికి ఎనిమిది గంటల నిద్ర కచ్చితంగా అవసరమని చెప్తుంటారు నిపుణులు. కానీ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా స్లీప్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా అధ్యయనం మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది. ఒక గంట నిద్ర డిస్టర్బ్ అయితే ఏకంగా నాలుగు రోజులు నరకం చూడాల్సి వస్తుందని తెలిపింది. స్లీప్ డిప్రివేషన్ కారణంగా ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి వివరించింది.

సాధారణంగా 18 ఏళ్ల వయసు పైబడిన ప్రతి ఒక్కరికీ ఎనిమిది గంటల నిద్ర మస్ట్. ఇంకా చిన్నపిల్లలు అయితే ఎక్కువ సమయం పడుకోవాల్సిందే. కానీ ప్రజెంట్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడంతో నిద్రకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ క్రమంలో ఒక్క గంట తక్కువ నిద్రించినా.. నాలుగు రోజులు సఫర్ అవుతారని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. విపరీతమైన తలనొప్పి, పనిపై ఫోకస్ లేకపోవడం, అటెన్షన్ తగ్గడం, సరైన నిర్ణయం తీసుకోకపోవడం, ఎదుటి మనిషితో ప్రవర్తన కూడా సరిగ్గా ఉండకపోవడం, నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి సమస్యల వలన దీర్ఘకాలిక అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా నైట్ షిఫ్ట్ చేస్తున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పూర్ స్లీప్ మెంటల్లీ, ఫిజికల్లీ ఎఫెక్ట్ చూపొచ్చు.

Similar News