బీరు చల్లగానే ఎందుకు తాగుతారు..?

వీకెండ్ వచ్చిందంటే చల్లటి బీరులో మునిగితేలేద్దాం మామ అంటూ బ్యాచిలర్స్ ఫోన్లు చేసుకుంటారు. సిట్టింగ్ కు ప్లాన్ చేస్తారు. అయితే ఇలాగే చేసి బార్

Update: 2024-05-06 07:45 GMT

దిశ, ఫీచర్స్: వీకెండ్ వచ్చిందంటే చల్లటి బీరులో మునిగితేలేద్దాం మామ అంటూ బ్యాచిలర్స్ ఫోన్లు చేసుకుంటారు. సిట్టింగ్ కు ప్లాన్ చేస్తారు. అయితే ఇలాగే చేసి బార్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు శాస్త్రవేత్తలు.. అసలు బీరును చల్లగానే తాగాలని ఎందుకు అనుకుంటారని చర్చించుకుని దానిపై రీసెర్చ్ మొదలుపెట్టారు. వాటర్, ఇథనాల్ సొల్యూషన్స్ కాంటాక్ట్ లో వేరియేషన్ వల్లే టేస్ట్ చేంజ్ అవుతుందని.. అందుకే బీరును చల్లగానే సేవించేందుకు ఇష్టపడతారని గుర్తించారు.

బీరు తక్కువ ఆల్కహాల్ సాంద్రతను కలిగి ఉంటుంది. రూమ్ టెంపరేచర్ వద్ద ఇందులోని ఇథనాల్ నీటితో పిరమిడ్ షిప్ నిర్మాణాలతో ఇంటరాక్ట్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడు బీరు తక్కువ ఆల్కహాల్ కలిగినట్లు అనిపిస్తుంది. అదే గది ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీలు తక్కువ చేస్తే.. ఇథనాల్, వాటర్ తో చెయిన్ షేప్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది నాలుకపై ఎక్కువ ఆల్కహాల్ ఉన్న రుచిని కలిగిస్తుంది. కాబట్టి మందుప్రియులు ఎక్కువ ఆల్కహాల్ టేస్ట్ తో ఉన్న చలచల్లని బీరు తాగేందుకు ఇష్టపడుతారు. కాగా ఈ అధ్యయనం మన ఫేవరెట్ డ్రింక్స్ ఏ టెంపరేచర్ లో పర్ఫెక్ట్ గా తీసుకోవాలో సూచించింది. ఆల్కహాల్ డ్రింక్స్ ఇండస్ట్రీ తక్కువ ఆల్కహాల్ తో కూడా గ్రేట్ టేస్ట్ పానీయాలు అందించవచ్చని వివరించింది.

Similar News