దగ్గరికి వెళ్లగానే లోపలికి లాగేసుకుంటున్న బ్లాక్ హోల్స్.. ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసిన నాసా

అంతు పట్టని విశ్వ రహస్యాలపై సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వారు సౌర మండలంలో ఒక కొత్త బ్లాక్ హోల్‌ను గుర్తించారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన రీసెర్చర్స్ మరో అంశంతో మనముందుకు వచ్చారు.

Update: 2024-05-09 08:46 GMT

దిశ, ఫీచర్స్ : అంతు పట్టని విశ్వ రహస్యాలపై సైంటిస్టులు ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వారు సౌర మండలంలో ఒక కొత్త బ్లాక్ హోల్‌ను గుర్తించారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన రీసెర్చర్స్ మరో అంశంతో మనముందుకు వచ్చారు.బ్లాక్ హోల్స్ ఉనికితోపాటు అవి ఎలా పనిచేస్తాయనే విధానాన్ని ఆధునిక టెక్నాలజీతో పరిశీలించారు. బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుందో వెల్లడిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు.

బ్లాక్ హోల్స్ లేదా కృష్ణ బిలాల గురించి తెలిసినప్పటికీ, వాటిలో ఏముంటుందో అనే విషయం ఇప్పటకీ తెలియదు. ఈ మిస్టరీని ఛేదించేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు మిస్టరీని ఛేదించలేకపోయారు. ఎందుకంటే బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్లగానే ఏ వస్తువునైనా, ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించినా ఆ వస్తువును అదితన లోపలికి ఆయస్కాంతంలా లాగేసుకుంటుందట. తాజాగా షేర్ చేసిన వీడియోలో నాసా దీని గురించి స్పష్టంగా తెలియజేసింది. ఇక కృష్ణ బిలం దగ్గర ఈవెంట్ హారిజన్ ఉంటుంది. దీనిని బ్లాక్ హోల్స్ ఉపరితలంగా పేర్కొంటారు. ఇక్కడ కాలం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంటే భూమిపై ఉన్నట్లు రాత్రి, పగలు వంటివి ఉండవు. ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది.

విశ్వంలో బ్లాక్ హోల్స్ చాలా ఉండవచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రెండింటిని మాత్రమే కనుగొన్నారు. పైగా ఈ కృష్ణ బిలాలకు గ్రావిటీ పవర్ ఎక్కువ. అందువల్ల వాటి దగ్గరకు వచ్చే ఏ వస్తువైనా, చివరకు నక్షత్రాలనైనా అవి మింగేస్తుంటాయి. వాటి లోపల ఏది పడినా అది తిరిగి రాకపోగా అసలు ఏమైపోతుందో కూడా తెలియదు. ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉందని సైంటిస్టులు అంటున్నారు.


Full View


Similar News