30 ఏళ్లు దాటిన మగవారు జాగ్రత్త.. అవి తీసుకోకపోతే కష్టం..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎక్కువగా అనారోగ్యాలకు గురవతున్నారు.

Update: 2024-05-04 15:40 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎక్కువగా అనారోగ్యాలకు గురవతున్నారు. చిన్న తనంలోనే షుగర్, బీపీ వంటి వాటితో సఫర్ అవుతున్నారు. అదే వయసు మీద పడిందంటే చెప్పాల్సిన పని లేదు. మంచానికి అంకితం అయిపోతున్నారు. ఇక యువత అయితే.. కుటుంబ బాధ్యతలు మొయ్యడమే కాకుండా.. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి, మానసిక ఆందోళనల కారణంగా చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. దీంతో ఆరోగ్య పరంగా వారు మరింత డేంజర్‌లో పడుతున్నారు. ఈ క్రమంలోనే యువకులను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి తాజా అధ్యయనాలు. 30 ఏళ్లు దాటిన వాళ్లు కచ్చితంగా ఆరోగ్యం విషయం శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే.. 30 ఏళ్లు పైబడిన పురుషులు ఏ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

* 30 ఏళ్లు పైబడిన పురుషులు ఎక్కువగా ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలట. వీటిలో ఉండే విటమిన్ కె రక్తంని సుద్ది చేస్తుందట. అంతే కాకుండా ఎముకల ఆరోగ్యానికి కీలకంగా పనిచేస్తుందట. వయస్సు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టాన్ని కూడా నివారించడంలో విటమిన్ కె కీలన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు.

* 30 ఏళ్ల వయసు దాటిన వారిలో ఎక్కువగా టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయట. ఇది కండరాల, శారీరక బలం స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి విటమిన్ డి ఎంతో అవకసరం. విటమిన్ డి ఉండే ఐటెమ్స్‌ను తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలను పెరుగుతాయి. అలాగే గుండె సమస్యలు, కొన్ని క్యాన్సర్ల నుంచి రక్షిణ కల్పిస్తుంది. పాలు, ఆరేంజెస్, గుడ్లు,​పుట్టగొడుగులు,​రెడ్ మీట్ వంటిలో ఎక్కువగా విటమిన్ డి ఉంటుంది.

* గుండె, కండరాల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. బాదం పప్పు, జీడి పప్పు, ఇతర నట్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల బాడీలో మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా రక్తపోటు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంటోంది. 

Similar News