చెమటలు పడితే మంచిదా.. కాదా?

ఈ మండు వేసవిలో మనిషి అన్న వాడికి చెమటలు పట్టడం సర్వసాధారణం. రోజుకు లీటర్ల కొద్ది నీళ్లు తాగినా.. అది కాస్తా చెమట రూపంలో బయటకు వెళ్తూనే ఉంటుంది.

Update: 2023-06-13 04:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ మండు వేసవిలో మనిషి అన్న వాడికి చెమటలు పట్టడం సర్వసాధారణం. రోజుకు లీటర్ల కొద్ది నీళ్లు తాగినా.. అది కాస్తా చెమట రూపంలో బయటకు వెళ్తూనే ఉంటుంది. మానవ శరీరంలో హీట్ జనరేట్ అయినప్పుడు చెమటలు వస్తాయి. అధికంగా చెమటలు రావడం వల్ల బాడీ డీ హైడ్రేడ్ అవుతుందేమోనని కొందరి అపోహ. కానీ, అందతా ట్రాష్, చెమటలు రావడం అనేది ఆరోగ్యానికి మంచిదే, అది ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతోంది. చెమట వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని అనే విషయం అందరికీ తెలియదు.

చెమటలకు రావడానికి ప్రధాన కారణం..

వేసవిలోలో కొందరికి విపరీతంగా చెమటలు వస్తాయి. బాడీ టెంపరేచర్ 91 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారన్ హీట్ మధ్య ఉంటుంది. ఈ కాలంలో చెమటలు విపరీతంగా పడుతాయి. దీంతో మనలో ఉన్న పోషకాలు చెమట రూపంలో బయటకు వెళ్లడంతో త్వరగా అలసిపోతాం. ఇలా వేసవి కాలంలో మన శరీరం వేడికి గురై చెమట బయటకు రావడం సహజమే. దీని వల్ల ఇబ్బందులు లేవు. కంగారు పడాల్సిన అవసరం లేదు.

చర్మంలోని మలినాలు.. చెమటతో బయటకు..

చెమట పడితే చర్మానికి మేలు కలుగుతుంది. దీని వల్ల కాస్త దుర్వాసన వచ్చినా శరీరంలోని మలినాలు బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. శరీరాన్ని నియంత్రించడానికి చెమట దోహదం చేస్తుంది. చర్మం తాజాగా ఉంచడానికి ఈ పరిణామం ఉపకరిస్తుంది. చెమట చర్మానికి మంచే చేస్తుంది కానీ, చెడు మాత్రం చేయదని వైద్యులు చెబుతున్నారు.

రక్తప్రసరణను మరింత మెరుగు.. 

శరీరంలోని ఉప్పును చెమట బయటకు తీసుకొస్తుంది. మురికి, దుమ్ము, ధూళీ పట్టకుండా చేస్తుంది. చెడుచూపును నిరోధిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియా గుణాలు రాకుండా చేస్తుంది. సహజమైన మాయిశ్చరైజర్ గా చెమట పనిచేస్తుంది. టాక్సిన్ ను దూరం చేస్తుంది. ఇలా చెమట వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చెమటలు ఎక్కువగా వచ్చే వారు ఈ విషయంలో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు.

Also Read:   తిథిని బట్టి స్త్రీలలో శృంగార కోరికలు.. ఏ తిథిన కామం ఎలా విచ్చుకుంటుందంటే..? 

యుక్త వయస్సులో మద్యపానంతో దెబ్బతింటున్న మెదడు

Tags:    

Similar News