Live-In Relationship: సహజీవనం లీగలా? ఇల్లీగలా..? సుప్రీంకోర్టు ఏం చెబుతుందో తెలుసా..?

బంధాలకు బాంధవ్యాలకు పుట్టినిల్లు భారతదేశం.

Update: 2024-05-24 04:28 GMT

దిశ వెబ్ డెస్క్: బంధాలకు బాంధవ్యాలకు పుట్టినిల్లు భారతదేశం. మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు విదేశీలు సైతం చేతులెత్తి నమస్కరిస్తారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే దూరపు కొండలు నునుపు అన్నట్టు మనలో కొంతమంది పాశ్చాత్య సంస్కృతికి అలావాటు పడుతున్నారు. ముఖ్యంగా సహజీవనాన్ని ఫ్యాఫన్‌గా ఫీల్ అవుతూ, సుప్రీకోర్టు సహజీవనం తప్పుకాదని చెప్పిందని, మిడిమిడి జ్ఞానంతో చట్టంలో ఏముందో పూర్తిగా తెలుసుకోకుండా.. తమ జీవితాలను నాశనం చేసుకోవడంతోపాటుగా ఇతరుల జీవితాలను సైతం నాశనం చేస్తున్నారు. అసలు సహజీవనం గురించి సుప్రీంకోర్టు ఏం చెబుతోంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సహజీవనం అంటే ఏమిటి..?

స్త్రీ పురుషులు తమకు వివాహచట్టంపైన నమ్మకంలేక, లేదా ఇతర ఏ కారణాల చేతనైన పెళ్లి వద్దనుకుని, ఇదరు ఒక అవగాహణతో పెళ్లికాకుండానే ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తల్లా జీవించడాన్ని సహజీవనం అంటారు.

ఎవరు సహజీవనానికి అర్హులు..?

పెళ్లికాని స్త్రీ పురుషులు సహజీవనానికి అర్హులు. అలానే భర్త చనిపోయిన భార్య, భార్య చనిపోయిన భర్త మరొకరితో సహజీవనం చేయవచ్చు. కానీ వివాహ బంధంలో ఉండి స్త్రీ అయినా.. పురుషుడైనా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది సహజీవనంగా పరిగణించబడదు. భార్య ఉండగా భర్తగాని, భర్త ఉండగా భార్యగాని మరో వ్యక్తితో సహజీవనం చేయాలంటే కచ్చితంగా భార్యాభర్తలు విడాకులు తీసుకుని ఉండాలి.

వివాహ బంధంలో ఉండి విడాకులు తీసుకోకుండా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం చట్టరిత్యా నేరం కింద పరిగణించబడుతుంది. బాధితులు ఫిర్యాదు చేస్తే వివాహేతర సంబంధం పెట్టుకున్నవారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.

సహజీవనంలో సమస్యలు వస్తే కోర్టును ఆశ్రయించవచ్చా..?

సహజీవనంలో సమస్యలు వస్తే కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే పది రోజులు కలిసుండి, ఈ నేపథ్యంలో సమస్యలు వచ్చాయని కోర్టులో కేసు వేస్తానంటే అది కుదరదు. భార్యాభర్తల్లా కొన్ని సంవత్సరాలు కలిసి ఉండాలి, అలానే ఇద్దరు కలిసి ఉన్నట్టు సాక్ష్యాలు ఉండాలి. అంటే అద్దె ఇంట్లో ఉంటే ఆ ఇంటి ఓనర్ లేదా ఇరుగుపొరుగు వాళ్లు, బాధితులు భార్యాభర్తల్లా కలిసి జీవించినట్టు అఫిడివిట్ ఇవ్వాలి.

లేదా రేషన్ కార్డు వంటి వాటిలో ఇద్దరి పేర్లు ఉండాలి. అప్పుడే కోర్టులో కేసు వేసేందుకు వీలవుతుంది. అలానే సహజీవనంలో పిల్లలు పుడితే లీగల్‌గా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. కానీ ఒకవేళ తన భాగస్వామి ఆ బిడ్డలు తనకు పుట్టలేదని అంటే, ఆ బిడ్డలు ఆమెకు ఆమె భాగస్వామికే పుట్టినట్టు నిరూపించుకోవాల్సి ఉంటుంది.  

Similar News