ఇంట్రెస్టింగ్ : మనుషులే కాదు, పాములు కూడా స్నానం చేస్తాయంట!

సోషల్ మీడియా వచ్చాక, వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే తెలిసిపోతుంది. అంతే కాకుండా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ

Update: 2024-04-28 15:55 GMT

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా వచ్చాక, వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే తెలిసిపోతుంది. అంతే కాకుండా మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటూ.. ఇది నిజమా? ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నాం.

అయితే మీకు ఆశ్చర్యం కలిగించే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ మనుషులు స్నానం చేయడం అనేది చాలా కామన్. కానీ పాములు స్నానం చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? ఏంటీ అసలు పాములు ఎక్కడైనా స్నానం చేస్తాయా అనుకుంటున్నారు కదా.. కానీ నిజంగానే పాములు స్నానం చేస్తాయంట. అంతే కాదండోయ్ వాటికి గోరు వెచ్చటి నీటిలో స్నానం చేయడం చాలా ఇష్టం అంట.

అసలు విషయంలోకి వెళ్తే..చాలా వరకు పాములు రోజూ స్నానం చేస్తాయంట. స్నానం చేయడం వాటికి చాలా అవసరం అంటున్నారు నిపుణులు. పాములు చాలా వరకు డీ హైడ్రేషన్‌కు గురి అవుతాయంట. అందువలన అవి గోరు వెచ్చటి నీటిలోకి వెళ్లి తమ శరీరాన్ని నీటిలో అటు, ఇటు తిప్పుతూ స్నానం చేస్తాయంట. అంతే కాకుండా వాటర్ కూడా తాగుతాయంట. ఇలా చేయడం వలన అవి హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, వాటి శరీరం మీద ఉన్న చర్మ రంధ్రాలు శుభ్రపడి, శ్వాస పీల్చుకోవడానికి ఈజీగా ఉంటుందంట. అందుకే అవి ప్రతి రోజూ స్నానం చేస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే జూలలో ఓ గిన్నెలో నీరు నింపి ఉంచుతారు. అయితే చాలా వరకు పాములు చల్లటి నీటిని ఇష్టపడవంట.

Similar News