శోభనానికి ముహూర్తం పెట్టడం వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..

పెళ్లి, గృహ ప్రవేశం, నామకరణం.. ఇలా ప్రతి శుభ కార్యానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో

Update: 2024-05-01 03:29 GMT

దిశ, ఫీచర్స్: పెళ్లి, గృహ ప్రవేశం, నామకరణం.. ఇలా ప్రతి శుభ కార్యానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో ఆ కార్యం పూర్తి అయితే అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. కానీ శోభనానికి కూడా ముహూర్తం ఎందుకు పెడుతారు? ఎప్పుడు కలిస్తే ఏంటి? పుట్టేది పిల్లలే కదా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. కానీ దీని వెనుక పెద్ద కథే ఉంది. ఇదే దీని వెనుకున్న అసలైన సైన్స్ అంటుంటారు.


ఒక జీవిని సృష్టించడం యజ్ఞంతో సమానం. ఇందులో పురుషుడు బీజం అయితే.. స్త్రీ క్షేత్రంగా చెప్పబడుతుంది. ఈ బీజం తగిన వాతావరణంలో సరైన క్షేత్రంలో పడితే పుట్టే సంతానం అద్భుతంగా ఉంటారని నమ్ముతారు. లేదంటే ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పేందుకు ఓ కథను ప్రస్తావిస్తారు. సంధ్యా సమయంలో కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటూ ఉండగా.. ఆయన భార్య వచ్చి శృంగారంలో పాల్గొనాలని కోరుతుంది. ఆయన కూడా ఓకే చెప్పిన తర్వాత.. ఆ సమయంలోనే ఆ తంతు జరిగిపోతుంది. కానీ పురాణాల ప్రకారం ఆ సాయంత్రం శృంగారానికి నిషిద్ధం కాబట్టి వీరికి పుట్టిన పిల్లలైన హిరణ్యక్షుడు, హిరణ్య కశిపుడు రాక్షసులుగా మారుతారు. రాక్షస ఘడియల్లో జన్మించిన వీరు లోక వినాశకులుగా మారుతారు.

అందుకే రాక్షస ఘడియల్లో కాకుండా అంటే సంధ్యా సమయంలో కాకుండా మంచి ముహూర్తం పెట్టి ఈ తంతు పూర్తి చేసేలా పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఈ శుభకార్యం శుభ ఘడియల్లోనే జరగాలని ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తారు.


Similar News