ఇంట్లో చెదలు పడితే కుటుంబంలో ఈ సమస్యలు తలెత్తడానికి సంకేతమట..
మనం అప్పుడప్పుడూ చెట్లకు చెదలు పట్టడాన్ని చూస్తూనే ఉంటాం. అలాగే మన ఇంట్లో ఉండే చెక్క వస్తువులు, పుస్తకాలకు కూడా చెదలు పడుతుంటాయి.
దిశ, వెబ్ డెస్క్: మనం అప్పుడప్పుడూ చెట్లకు చెదలు పట్టడాన్ని చూస్తూనే ఉంటాం. అలాగే మన ఇంట్లో ఉండే చెక్క వస్తువులు, పుస్తకాలకు కూడా చెదలు పడుతుంటాయి. ఈ చెద పురుగులు పట్టడం మన ఇంటికే కాదు మన కుటుంబంలో కూడా ఎంతో నష్టం కలుగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చెద పురుగులు పట్టడం వల్ల మానసిక బాధలు, భార్యా భర్తల మధ్య సమన్వయ లోపం, కటుంబంలో శాంతి లేకపోవడం, ఆర్థిక బాధలు వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇలా చెదలు పట్టిన వెంటనే ఆ వస్తువును లేదా ఆ ప్రదేశాన్ని వెంటనే శుభ్రం చేయాలి. చెద పురుగులను నివారించే మందును కానీ, కిరోసిన్ కానీ ఉపయోగించి ముందుగా అంతా శుభ్రం చేయాలి. చెదలు ప్రారంభమైన స్థానాన్ని గుర్తించి అక్కడి నుండి దానిని సమూలంగా నాశనం చేయాలి. ఇలా చేయడం వల్లే మనకు అదృష్టం కలుగుతుంది. మన ఇంట్లో ఉండే దరిద్రం అంతా బయటకు పోతుంది. చెద పురుగులు పట్టడం దరిద్రానికి సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇంటికి చెద పట్టిందంటే మనకు దరిద్రం పట్టినట్టేనని చెద పట్టిన వెంటనే దానిని సమూలంగా నాశనం చేయాలని వారు చెబుతున్నారు.