ఇంటి వంట కూడా అనారోగ్యమే.. దిమ్మతిరిగే రిపోర్ట్ రిలీజ్

కొందరు వంట చేయడాన్ని ఇష్టపడతారు. దీనివల్ల ధ్యానం చేసిన అనుభూతిని పొందుతారు.

Update: 2024-05-27 08:32 GMT

దిశ, ఫీచర్స్ : కొందరు వంట చేయడాన్ని ఇష్టపడతారు. దీనివల్ల ధ్యానం చేసిన అనుభూతిని పొందుతారు. కానీ కొందరు మాత్రం కుకింగ్ అంటే చిరాకు పడుతారు. దాన్ని పెద్ద పనిగా భావిస్తారు. ఏదేమైనా ఇంటి వంట ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణుల సలహా. కాగా తద్వారా సరైన పోషకాహారం శరీరానికి లభిస్తుందని సూచిస్తారు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దిమ్మతిరిగే విషయాన్ని వెల్లడించింది. ఇంటి వంట కూడా అనారోగ్యమని హెచ్చరిస్తుంది. అలా అన్ హెల్తీ కాకుండా ఉండాలంటే చేయాల్సిన, చేయకూడని పనులేంటో సూచించింది. వంట చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో లిస్ట్ రిలీజ్ చేసింది.

కామన్ మిస్టేక్స్ :

* కూరగాయలను అతిగా ఉడికించడం

కూరగాయలను ఎక్కువగా ఉడికించడం వల్ల విలువైన పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా విటమిన్లు, మినరల్స్ హీట్-సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎక్కువసేపు ఉడికించడం వల్ల నాశనం అవుతాయి.

* నూనె ఎక్కువ వాడటం

అధిక మొత్తంలో నూనె వినియోగంతో వంటలలో కేలరీలు, కొవ్వు పదార్ధాలు గణనీయంగా పెరుగుతాయి. ఇది బరువు పెరుగుటతోపాటు పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

* ఎక్కువ మంటపై వంట

డీప్-ఫ్రై లేదా చాలా ఎక్కువ వేడి వద్ద గ్రిల్ చేయడం వలన క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్న యాక్రిలామైడ్స్, హెటెరోసైక్లిక్ అమైన్‌ల వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి.

* మితిమీరిన ఉప్పు వాడకం

వంట చేసేటప్పుడు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలలో అధిక మొత్తంలో ఉప్పును వినియోగించడం వలన అధిక రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధులు రావచ్చు.

* ఆహార భద్రత నిర్లక్ష్యం

ఫుడ్ స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం, కిచెన్ లో సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో ఆ పదార్థాల్ని తినడం ద్వారా అనారోగ్యాల బారిన పడుతారు.

హెల్తీ ఫుడ్ టిప్స్ :

* కూరగాయలు వాటి రంగు, ఆకృతి కోల్పోకుండా వండేందుకు ప్రయత్నించాలి. ఈ పద్ధతి ఎక్కువ మొత్తంలో పోషకాలను సంరక్షిస్తుంది.

* నూనెలు తక్కువగా వాడాలి. ఎయిర్ ఫ్రై వంటి ఆరోగ్యకరమైన వంట పద్ధతులను ఎంచుకోవాలి.

* వంట చేసే టైం తగ్గించడంతో పాటు సన్నని సెగ మీద ఫుడ్ ప్రిపేర్ చేయాలి. తద్వారా హానికరమైన సమ్మేళనాలు ఏర్పడటాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది.

* ఉప్పును తక్కువగా వాడండి. రుచి కోసం సాల్ట్ మీదనే ఆధారపడకుండా మూలికలు, సుగంధ ద్రవ్యాలు, సిట్రస్ వంటివి యూజ్ చేయండి.

* పాత్రలను పూర్తిగా కడగడం, తక్కువ మంటపై వంట చేయడం, మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా సరైన ఆహార పరిశుభ్రత సాధ్యం అవుతుంది.

Similar News