తెల్లటి సాక్స్‌పై బురద మరకలా?.. ఈజీగా తొలగిపోవాలంటే ఇలా చేయండి

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిరోజూ సాక్స్ ఉతుక్కునే సమయం ఉండకపోవచ్చు. ఉన్నా కూడా రోజు మొత్తం షూ ధరించి ఉండటంవల్ల మారడం, తెల్లటి సాక్స్‌పై బురద మరకలు పడటం సహజంగానే జరిగిపోతూ ఉంటాయి.

Update: 2024-05-10 11:13 GMT

దిశ, ఫీచర్స్ : ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతిరోజూ సాక్స్ ఉతుక్కునే సమయం ఉండకపోవచ్చు. ఉన్నా కూడా రోజు మొత్తం షూ ధరించి ఉండటంవల్ల మారడం, తెల్లటి సాక్స్‌పై బురద మరకలు పడటం సహజంగానే జరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల చాలామంది నెలకోసారి కొత్తవి కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ప్రతినెలా ఒక చిన్న అదనపు ఖర్చు పెరిగినట్లే. అలా జరగకుండా ఉండాలంటే సాక్స్ పరిశుభ్రంగా ఉండాలి. అయితే వాటిపై బురద మరకలు ఈజీగా తొలగిపోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

* బురద మరకలే కాదు, ఏ మరకలైనా సరే.. సాక్సును వేడి నీళ్లు, బేకింగ్ సోడాతో శుభ్రం చేస్తే అవి ఈజీగా తొలగిపోతాయి. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి అందులో సాక్సుల‌ను కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత నీటితో కడగాలి.

* బ్లీచింగ్ పౌడర్ కూడా బురద మరకలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న బకెట్ లేదా టబ్‌లో వేడినీళ్లు తీసుకొని, అందులో బ్లీచింగ్ పౌడర్ వేసి మరకలు పడిన భాగాన్ని ముంచి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నీటితో ఎప్పటిలాగే కడిగేస్తే చాలు. మరకలు నిమిషాల్లో మాయం.

* ఆల్కహాల్ కూడా బురద మరకలను పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. ఒక మగ్గులో నీటిని తీసుకొని, కొంచెం ఆల్కహాల్, అలాగే నిమ్మకాయ రసం మిక్స్ చేసి, ఆ మిశ్రమంలో సాక్స్‌ను నానబెట్టాలి. కాసేపటి తర్వాత తీసి సాధారణంగా ఉతకాలి. ఎంతటి మొండి మరకలైనా ఇట్టే వదిలిపోతాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News