స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నాయా? అయితే ఈ ఆహారాలు తప్పక తీసుకోండి..

ప్రస్తుతం చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. సాధారణంగా శరీరంలో స్పెర్మ్ యొక్క సగటు సంఖ్య ఒక మిల్లీలీటర్ వీర్యంలో 1.5 మిలియన్ నుండి 3.9 మిలియన్లు కానీ అవి తగ్గినప్పుడు, స్పెర్మ్ లోపం వంధ్యత్వానికి దారితీస్తుంది.

Update: 2024-04-28 04:57 GMT

దిశ,ఫీచర్స్: ప్రస్తుతం చాలా మంది మగవారు ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గడం. సాధారణంగా శరీరంలో స్పెర్మ్ యొక్క సగటు సంఖ్య ఒక మిల్లీలీటర్ వీర్యంలో 1.5 మిలియన్ నుండి 3.9 మిలియన్లు కానీ అవి తగ్గినప్పుడు, స్పెర్మ్ లోపం వంధ్యత్వానికి దారితీస్తుంది. ఈ సమస్యల వల్ల పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. పురుషుడు తండ్రి కావాలంటే అతని స్పెర్మ్ కౌంట్ ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే సంతానోత్పత్తి బలహీనంగా మారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్యకు ప్రధాన కారణం ఆహారం. అందువలన మంచి ఫుడ్ తీసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు. కాగా, ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

పుచ్చకాయ గింజలు :

పుచ్చకాయ గింజలు తీసుకోవడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ మరియు స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది.

గుమ్మడికాయ గింజలు:

గుమ్మడికాయ గింజలలో స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన జింక్ అధికంగా ఉంటుంది. అలాగే టెస్టోస్టెరోన్ స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది,

పొద్దుతిరుగుడు గింజలు:

పొద్దుతిరుగుడు గింజలలో విటమిన్ ఇ ఉండటం వల్ల స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది.

గుడ్డు:

గుడ్లు తీసుకోవడం వలన అందులో ఉండే విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ ఇ, జింక్, కాల్షియం మరియు ప్రోటీన్ వల్ల స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది.

ఎర్ర బియ్యం :

ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి, ఇది స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతాయి.

అరటిపండ్లు :

అరటిపండులో ఉండే ట్రిప్టోన్ సెరోటోనిన్‌గా మారీ మగ సెక్స్ హార్మోన్ లిబిడోను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆకుకూరలు:

రోజూ ఏదో ఒక ఆకు కూరని తినడం అలవాటు చేసుకోవడం వల్లస్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. అలాగే పాలకూరలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది తింటే స్పెర్మ్‌ వ్యాపించే సామర్థ్యాన్ని పెంచుతుంది.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.

Read More...

‘ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా’ అని ఆపరేషన్‌ మధ్యలో వెళ్లిపోయిన వైద్యుడు.. చివరికి ఏమైదంటే..?



Tags:    

Similar News