Health tips : వాష్‌రూమ్‌కు అన్నిసార్లు వెళ్తున్నారా?.. Heart attack తప్పదేమో!

How often you go to the toilet daily signals risk of 'future' heart attack

Update: 2022-09-15 09:09 GMT

దిశ, ఫీచర్స్ : శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్‌ తొలగించేందుకు క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లే అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. పూపింగ్ ఫ్రీక్వెన్సీకి గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాలకు మధ్య లింక్ ఉందని చైనాకు చెందిన నిపుణులు తెలిపారు. అంటే తరచూ మలవిసర్జన చేసే అలవాటు ఆరోగ్యం గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం..

పెకింగ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల పరిశోధన ప్రకారం.. రోజుకు ఒకసారైనా మలవిసర్జన చేయకుంటే గుండె సమస్యల ప్రమాదాన్ని సూచిస్తుంది. అలాగే వారానికి మూడు కంటే తక్కువసార్లు మలవిసర్జన చేస్తే పక్షవాతం, మూత్రపిండాలు లేదా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ప్రేగు కదలికలు ఎక్కువగా లేకపోవడమే మలబద్ధకాన్ని సూచిస్తుంది. ఈ అధ్యయనానికి సంబంధించి పరిశోధకులు 30 నుంచి 79 ఏళ్ల వయసు గల ఐదు లక్షల మంది ఆరోగ్యవంతుల ప్రేగు కదలికలను 10 ఏళ్ల పాటు ట్రాక్ చేశారు. ఈ మేరకు జీర్ణాశయం వెలుపల సంభవించే వ్యాధులతో ప్రేగు కదలిక ఫ్రీక్వెన్సీల మధ్య సంబంధాన్ని వారు పరిశీలించారు.

కామన్‌గా రోజుకు ఎన్నిసార్లు?

కొంతమంది రోజుకు మూడుసార్లు మలవిసర్జనకు వెళ్తే.. మరికొందరు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు కూడా వెళ్తుంటారు. అయితే ఈ కింది లక్షణాలను అనుభవిస్తే మాత్రం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది :

* విపరీతమైన అలసట

* ఊహించనంతగా బరువు తగ్గడం

* కడుపులో నొప్పి లేదా అసౌకర్యం

* ప్రేగు అలవాట్లలో మార్పు(సాధారణం కంటే ఎక్కువసార్లు వెళ్లడం)

* మలంలో రక్తం

* బరువు తగ్గడం

Tags:    

Similar News