మనిషిని బలహీన పరుస్తున్న టాక్సిక్ పాజిటివిటీ.. అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదంటున్న నిపుణులు

పాజిటివ్ థింకింగ్‌కు చాలా పవర్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది నిరూపించదగిన ఎవిడెన్స్ కూడా ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాజిటివిటీ అవసరమే. కానీ ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ విషయంలోనూ దానిపైనే ఆధారపడటానికి ప్రయత్నిస్తేనే అది టాక్సిక్ పాజిటివిటీగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఇది ప్రమాదకరం.

Update: 2024-05-03 13:22 GMT

దిశ, ఫీచర్స్ : పాజిటివ్ థింకింగ్‌కు చాలా పవర్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇది నిరూపించదగిన ఎవిడెన్స్ కూడా ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాజిటివిటీ అవసరమే. కానీ ప్రతీ సందర్భంలోనూ, ప్రతీ విషయంలోనూ దానిపైనే ఆధారపడటానికి ప్రయత్నిస్తేనే అది టాక్సిక్ పాజిటివిటీగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఇది ప్రమాదకరం. దీనివల్ల వ్యక్తి ప్రతికూల పరిస్థితులను, భావోద్వేగాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవచ్చు.

పాజిటివ్ థింకింగ్ మంచిదే.. కానీ ఎక్కువైతేనే ప్రమాదం. పైగా అదేమీ శూన్యంలో నుంచి పుట్టుకొచ్చిందేమీ కాదు. అదొక్కటే ముఖ్యమని, అది మాత్రమే మేలు చేస్తుందని భావించాల్సిన అవసరం లేదు. దానికి సామాజిక మద్దతు, స్వీయ సమర్థత, తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు తోడైతేనే మానవ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. కేవలం పాజిటివిటీని మాత్రమే స్వీకరిస్తే టాక్సిక్ పాజివిటీగా మారుతుంది. దీనిని అవైడ్ చేయడం వల్ల మనుషుల్లో మానసిక స్థిరత్వం, దృఢత్వం ఏర్పడతాయి.

టాక్సిక్ పాజిటివిటీకి ఉదాహరణ

ఒక వ్యక్తి తను చేస్తున్న పనిలో రాణించకపోవడం వల్ల బాధపడుతున్నారనుకుందాం. అప్పుడు వాస్తవాలు వివరించాలి. ఎదిగే మార్గం చూపాలి. కొంగ్రొత్త ప్రయోగాలకు అవకాశం ఇవ్వాలి. స్వీయ అనుభవం ద్వారా నేర్చుకునేలా, వాస్తవాలు గుర్తించేలా ప్రోత్సహించాలి. కానీ ఇందుకు భిన్నంగా అతనికి రాదు కాబట్టి మనమే ఆ వ్యక్తి విషయంలో సర్వస్వం అనుకొని సహాయం చేయడం, అవసరం ఉన్నా లేకున్నా అడిగి మరీ హెల్ప్ చేయడం, ప్రతిదానికీ నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం అవతలి వ్యక్తిని బలహీన పరుస్తుంది.

పర్యవసనాలు

ఒక వ్యక్తి టాక్సిక్ పాజిటివిటీ బిహేవియర్ వల్ల అవతలి వ్యక్తి నష్టపోతారు. గృహ హింస కేసులకు సంబంధించిన ఒక అధ్యయనం ప్రకారం.. బాధితుల తరపున అధిక సానుకూల పక్షపాతంతో వ్యవహరించే కొందరు టాక్సిక్ పాజివిటీ ధోరణితో ఉంటున్నారు. వీరు సదరు వ్యక్తికి సపోర్టుగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ బాధలను అనుభవించేలా మోటివేట్ చేస్తుంటారు. దీంతో బాధితులు స్వయంగా ఎదుర్కోకుండా అడ్డుపడుతుంటారు. ఇలా.. ప్రతికూల విషయాలను, భావోద్వేగాలను ప్రదర్శించ కూడదనే ఒత్తిడికి గురయ్యే వారు ఇతరుల సహాయం కోరేందుకు ఇష్టపడకపోవడంవల్ల నష్టపోతారు. ఇది వారిలో తక్కువ ఆత్మగౌరవానికి దారితీస్తుంది.

ఎలా ఎదుర్కోవాలి

నిరంతరం సానుకూలంగా ఉండాలనే ఒత్తిడిని లేదా టాక్సిక్ పాజిటివిటీని నివారించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ప్రతికూల, సానుకూల భావోద్వేగాలన్నీ జీవితంలో ఒక భాగమని గుర్తించాలి. చిన్న చిన్న ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కోవడంలో ఇతరులపై ఆధారపడటాన్ని నివారించాలి. సమస్య నుంచి తప్పించుకునే ధోరణి కాకుండా ఎదుర్కొకోవాలని నిశ్చయించుకున్నప్పుడు టాక్సిక్ పాజిటివిటీ మిమ్మల్ని ప్రభావితం చేయదు. అందుకోసం అవసరమైతే ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యల సపోర్ట్ తీసుకోవాలి. సమాజం నుంచి నేర్చుకోవాలి.

Read More..

వేడిగాలులతో తలనొప్పి వేధిస్తోందా?.. తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే సరి! 

Tags:    

Similar News