అందాలొలికే స్లీవ్ ఫ్యాషన్.. పాత, కొత్త కలయికలతో ఆధునిక హంగులు

మార్పు ప్రకృతి ధర్మం.. ఎప్పుడూ ఏదో ఒక దిశలో మారుతూనే ఉంటుంది. అలాగే చరిత్ర కూడా జడపదార్థం ఏమీ కాదు. అది తనదైన పద్ధతిలో పునరావృతం అవుతూనే ఉంటుంది. అయితే ఈ మార్పు కేవలం ప్రకృతి, చరిత్ర వరకే పరిమితం కాదని, సమాజంలో అనేక అంశాలకు వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-04-27 12:54 GMT

దిశ, ఫీచర్స్ : మార్పు ప్రకృతి ధర్మం.. ఎప్పుడూ ఏదో ఒక దిశలో మారుతూనే ఉంటుంది. అలాగే చరిత్ర కూడా జడపదార్థం ఏమీ కాదు. అది తనదైన పద్ధతిలో పునరావృతం అవుతూనే ఉంటుంది. అయితే ఈ మార్పు కేవలం ప్రకృతి, చరిత్ర వరకే పరిమితం కాదని, సమాజంలో అనేక అంశాలకు వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వాటిలో ఫ్యాషన్ రంగం కూడా ఒకటి. ఇండియన్ ఫ్యాషన్ ట్రెండ్ గురించి చెప్పుకుంటే.. 1980 నుంచి 1990 వరకు కూడా వస్త్ర ధారణలో ‘స్లీవ్ ఫ్యాషన్’ కాస్త ఎక్కువ ఆదరణ పొందింది. ఆ తర్వాత నుంచి స్లీవ్ అండ్ స్లీవ్ లెస్ ఫ్యాషన్ పాత, కొత్త కలయికగా ఉన్న మిక్స్‌డ్ ట్రెండ్‌గా కొనసాగుతోంది. న్యూయార్క్ అండ్ లండన్ ఫ్యాషన్ వీక్‌లలో కూడా పాత సంప్రదాయ వస్త్రధారణకు ఆధునిక హంగులతో మెరుగులు దిద్దడం, మోడల్స్ వాటిని ధరించి ర్యాంప్‌వాక్‌లు చేయడం మనం గమనించాం.

విస్తరిస్తున్న మార్కెట్

కంఫర్ట్ అండ్ ఫ్యాషనబుల్ కూడా కావడంతో ఇటీవల ఇండియాలో స్లీవ్ మానియా పెరిగిపోయిందని, చాలామంది వాటిని ఇష్టపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. దానికనుగుణంగా స్లీవ్ మార్కెట్ కూడా విస్తరిస్తోంది. కొందరు స్లీవ్ లేనిదే మహిళలు అందంగా కనిపించరని కూడా చెప్తుంటారు. అయితే ఏ రకమైన స్లీవ్స్ ధరిస్తే  బాగుంటుందోనని పలువురు సందేహాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. కానీ మహిళల్లో అందాన్ని ఇనుమడింపజేసే అనేక రకాల స్లీవ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

షార్ట్ అండ్ ఫుల్ 

ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఉంది. షార్ట్ స్లీవ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి సమ్మర్‌లో కంఫర్టుగా ఉంటాయని చాలామంది ఇష్టపడుతుంటారు. ఇవి కాస్త క్యాప్ స్లీవ్స్‌కు, లెంగ్త్ స్లీవ్స్‌కు భిన్నంగా ఉంటాయి. పొడవు తక్కువగా ఉంటాయి. కాబట్టి ధరించడంవల్ల అందంగా కనిపిస్తారని ఫ్యాషన్ డిజైనర్లు చెప్తున్నారు. ఇక ఫుల్ స్లీవ్స్ గురించి చెప్పుకుంటే ఇవి పొడవు ఎక్కువగా ఉంటున్నప్పటికీ రకరకాల డిజైన్లలో ఆకట్టుకుంటాయి. భుజాల వరకు బాడీని కవర్ చేసేవిగా ఉంటాయి.

బిషప్ అండ్ హాఫ్ షోల్డర్

ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న బిషప్ స్లీవ్స్ చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. పాత సినిమాల్లో చూస్తే గనుకు ఎక్కువగా ఇవి కనిపిస్తుంటాయి. కాలనుగుణంగా ఆధునిక హంగులు అద్దుకుంటూ సరికొత్తగా మారుతూ వచ్చాయి. వీటిని ధరించడం వల్ల అందంగా, అట్రాక్టివ్‌గా కాకుండా హుందాతనం కూడా ఉట్టిపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇక హాఫ్ షోల్డర్ స్లీవ్స్ విషయానికి వస్తే ఇవి కూడా అన్ని రకాల సైజుల్లో లభిస్తూ పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటాయి. ప్యాంటీలు, చీరలు, లెహంగాలు, వన్ పీస్ డ్రెసెస్, మాక్సీ డ్రెసెస్ మీద కూడా వీటిని ధరిస్తారు.

బట్టర్‌ఫ్లై అండ్ ఏంజెల్ 

బట్లర్ ఫ్లై స్లీవ్స్ కాస్త క్యాప్ స్లీవ్స్ కాంబినేషన్‌లో ఉంటాయి. డీప్ నెక్ టాప్స్ అండ్ డ్రెసెస్ మీద బాగా నప్పుతాయని, సౌకర్యంగానూ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. కుర్తీలు, బ్లౌజులు, టాప్స్‌పై ధరిస్తుంటారు. ఏంజిల్ స్లీవ్స్ గురించి చెప్పుకుంటే ఇటీవల వీటికి ఆదరణ మరింత పెరిగింది. వీటిని ధరించడంవల్ల మహారాణిలా అనిపించడమే కాకుండా ఆ ఫీలింగ్ కలుగుతుందట. ఇవి అన్ని రకాల దుస్తుల మీద కంఫర్టబుల్‌గా ఉంటాయని చెప్తున్నారు. ఇక వీటితోపాటు లాంగ్ స్లీవ్స్, పెటల్ స్లీవ్స్, స్లిట్ స్లీవ్స్, ఓపెన్ స్లీవ్స్ అని పలు రకాలుగా ఉంటాయి.

Similar News