Baobab Trees : కనువిందు చేస్తున్న వింత వృక్షాలు.. వేర్లు గాలిలో.. కాండం భూమిలో.. ఎందుకిలా? (వీడియో)

సాధారణంగా చెట్లు, మొక్కలు నిటారుగా ఉంటాయి. పైభాగంలో కొమ్మలు, రెమ్మలు, ఆకులతో అందంగా కనిపిస్తుంటాయి. కింది భాగంలో కాండం ఉంటుంది. దాని వేర్లు భూ భాగంలోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయి.

Update: 2024-05-17 04:25 GMT

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చెట్లు, మొక్కలు నిటారుగా ఉంటాయి. పైభాగంలో కొమ్మలు, రెమ్మలు, ఆకులతో అందంగా కనిపిస్తుంటాయి. కింది భాగంలో కాండం ఉంటుంది. దాని వేర్లు భూ భాగంలోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయి. ప్రపంచంలో వృక్షాలన్నీ ఇలాగే ఉంటాయి. వాటి సహజమైన పొందిక అది. కానీ ఒకే ఒక్క చెట్టు మాత్రం చూడటానికి అందుకు భిన్నంగా ఉంది. దీనికి వేర్లు పైభాగంలో ఉన్నట్లు కనిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఇది నిజం. అందుకే ఈ చెట్టును ‘తలక్రిందుల చెట్టు’గా పిలుస్తున్నారు. ఈ వింత వృక్షాల అసలు పేరేంటి? ఎందుకలా ఉన్నాయి?, వాటి వెనుక రహస్యమేంటి? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఒక్క చెట్టులో లక్ష లీటర్ల నీరు

తలక్రిందుల చెట్లుగా పేర్కొనే వింత వృక్షాలు ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. పైన వేర్లు, కింద కాండంతో కనిపించే ఈ బోలు చెట్లను బావోబాబ్ వృక్షాలు అంటారు. ఇవి ఆరువేల సంవత్సరాల వరకు జీవిస్తాయట. వీటి ఆకులు, పండ్లను స్థానిక ప్రజలు ఔషధాలుగా ఉపయోగిస్తారట. పైగా ఈ చెట్ల కాండంలో ఒక ఒక చెట్టు సుమారు లక్ష లీటర్ల నీటిని కలిగి ఉంటుంది. తెల్లగా ఉండే వీటి పువ్వులు రాత్రి పూట వికసిస్తాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. శరదృతువులో ఈ వృక్షాలు మరింత దృఢంగా కనిపిస్తాయి. వీటిని ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అని కూడా పిలుస్తారు.

ప్రచారంలో అనేక కథలు

బావోబాబ్ చెట్ల గురించి కొన్ని పౌరాణిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ చెట్ల కింద నలుగురు దేవకన్యలు ఉండేవారని, వారు మనుషులతో ప్రేమలో పడటంతో ఈ వృక్షం అసూయ చెందిందట. అంతటితో ఆగకుండా వారిని తన కాండంలో బంధించిందట. అందుకే ఈ జాబాబ్ చెట్ల కింది భాగం భారీగా ఉంటుందట. నేటికీ ఈ చెట్టులోపల సదరు దేవకన్యల గొంతు వినిపిస్తుందని ప్రజలు చెప్తుంటారు. కాగా ఆ చెట్టులో ఉండే నీటి ప్రవాహ శబ్దంగా నిపుణులు పేర్కొంటారు. శాస్త్రవేత్తలు ఇప్పుడు వీటి మూలాలను గుర్తించే పనిలో పడ్డారు.

బావోబాబ్ చెట్లతో ఉపయోగాలు

ఆఫ్రికాదేశంలోని రూరల్ ఏరియాలోనూ బావోబాబ్ చెట్లు చాలా కనిపిస్తుంటాయి. ఇక్కడి ప్రజలు వాటిని ‘మదర్ ఆఫ్ ది ఫారెస్ట్’గా కూడా పిలుస్తారు. వీటి పండ్లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వాటి కాండం భాగాన్ని ఫైబర్‌ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే తాళ్లు, బట్టలు నేయడానికి కూడా వినియోగిస్తారట. నేచర్‌ జనరల్ కథనం ప్రకారం.. బావోబాబ్ చెట్లు 21 మిలియన్ సంవత్సరాల క్రితం మడగాస్కర్‌లో ఉద్భవించించాయని వీటి డీఎన్ఏను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక ఆ తర్వాత 10 లక్షల సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వాటి ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఆఫ్రికాకు విస్తరించాయి. ప్రస్తుతం అనేక జాతులుగా ఉద్భవించాయని లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ లీచ్ అంటున్నారు.

Full View

Similar News