స్పెర్మ్ సెర్చ్ సాఫ్ట్‌వేర్.. ఏఐతో వీర్యకణాలను గుర్తించే టెక్నాలజీ డెవలప్

వరల్డ్ వైడ్‌గా 7 శాతం మంది పురుషులు లో స్పెర్మ్ కౌంట్‌తో సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Update: 2023-09-16 08:25 GMT

దిశ, ఫీచర్స్  : వరల్డ్ వైడ్‌గా 7 శాతం మంది పురుషులు స్పెర్మ్ కౌంట్‌తో సంతానలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (Artificial Intelligence Technology)ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ(Sydney University of Technology)కి చెందిన బయో మెడికల్ ఇంజినీరింగ్ పరిశోధకుడు డాక్టర్ స్టీవెన్ వసిలెస్క్యూ(Dr. Steven Vasilescu) అంటున్నారు. అతను తన టీమ్‌తో కలిసి ఓ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని డెవలప్ చేశాడు. తాము రూపొందించిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ సంతాన లేమితో బాధపడుతున్న పురుషుల నుంచి సేకరించిన స్పెర్మ్ శాంపుల్స్‌లోని శుక్రకణాలు లేదా వీర్య కణాలను నిపుణులైన డాక్టర్లకన్నా వెయ్యిరెట్ల వేగంతో గుర్తిస్తుందని అతను పేర్కొన్నాడు.

పరిశోధకులు కొత్తగా డెవలప్ చేసిన ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు ‘స్పెర్మ్ సెర్చ్’(Sperm search)గా పేరుపెట్టారు. సాధారణంగా లో స్పెర్మ్ కౌంట్ కేసుల్లో వైద్యులు వృషణాల నుంచి కొంత భాగాన్ని ఆపరేషన్ ద్వారా సేకరించి అందులో ఆరోగ్యకరమైన శుక్ర కణం కోసం మైక్రోస్కోప్‌ ద్వారా వెతుకుతారు. ఆ తర్వాత దానిని సేకరించి ఫలదీకరణం కోసం అండంలో ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. కానీ ఇందుకు బదులుగా కొత్త ఏఐ టెక్నాలజీతో ఆ పని చాలా సులువవుతుంది. స్పెర్మ్ శాంఫుల్ ఫొటోలను ‘స్పెర్మ్ సెర్చ్’ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేయగానే సెకన్ల వ్యవధిలో హెల్తీ శుక్రకణాలను సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ విధమైన వేగం కోసం వేలకు పైగా నమూనా ఫొటోలతో ట్రైనింగ్ ఇచ్చి సాఫ్ట్ వేర్‌ను డెవలప్ చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

Tags:    

Similar News