పీరియడ్స్ ప్రాబ్లెం ఆడ కుక్కలకు కూడా ఉంటుంది.. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది.. ఆ టైంలో వాటి ప్రవర్తన ఎలా ఉంటుందంటే?

ఆడవాళ్ల లాగే.. కొన్ని జంతువులు కూడా పీరియడ్స్ సమస్యతో బాధ పడుతుంటాయి.

Update: 2024-05-25 14:00 GMT

దిశ, ఫీచర్స్: ఆడవాళ్ల లాగే.. కొన్ని జంతువులు కూడా పీరియడ్స్ సమస్యతో బాధ పడుతుంటాయి. వాటిలో ఆడ కుక్కలు కూడా ఉన్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆడ కుక్కులు కూడా రుతుస్రావం సమస్యతో సతమతమవుతుంటాయి. అయితే.. చాలా మంది తమ ఇంట్లో పెట్స్‌ను ఇష్టంగా పెంచుకుంటారు. వారు తమ పెట్స్‌ను పీరియడ్స్ టైంలో ఎలా చూసుకోవాలి? అలాగే ఎన్ని మంత్‌కు ఒకసారి పీరియడ్స్ వస్తాయి? ఆ టైంలో వాటి ప్రవర్తన ఎలా ఉంటుంది? అలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లల్లో కుక్కలు పెంచుకునేటప్పటికీ.. వాటికి పీరియడ్స్ వస్తాయని చాలా తక్కువ మందికే తెలుసు. ప్రతి ఆడ కుక్కుకు ఆరు నెలలకు ఒకసారి పీరియడ్స్ వస్తుంది. అయితే.. ఇది ఆ కుక్క జాతిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. పీరియడ్స్ రావడాన్ని కొంత మంది కుక్కులకు వేడి చేసింది అని కూడా అంటారు. నార్మల్ డేస్‌లో కంటే ఆ టైంలో కుక్కల ప్రవర్తనలో మార్పులు కూడా వస్తాయి. దానిబట్టి కూడా వాటికి పీరియడ్స్ వచ్చిందని మనం గ్రహించవచ్చు. రుతుస్రావానికి ముందు ఆడ కుక్క జనానంగం వాచిపోతుంది. అంతే కాకుండా కుక్కలు నాలుకతో తమ వల్వాను పదేపదే శుభ్రం చేసుకుంటాయి. ఇక ఆ టైంలో సాధారణం కంటే ఫుడ్ తగ్గించేస్తాయి. నీరసంగా ఉంటాయి. దీన్ని బట్టి కుక్కకు త్వరలో పీరియడ్స్ రాబోతుందని మీరు గ్రహించాలి. ఆ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి.

పీరియడ్స్ కారణంగా.. ఇంటి నిండా అపరిశుభ్రంతో పాటు స్మెల్ కూడా వస్తుంది కాబట్టి.. మీ కుక్కను ఒకే దగ్గర ఉండే విధంగా కట్టేయాలి. ఎప్పటికప్పుడు నీటిగా స్నానం చేయించాలి. వాటి బొచ్చు కూడా పొడిగా ఉండేటా చూసుకోవాలి. అతి ముఖ్యంగా ఆ టైంలో మగ కుక్కులు ఆడ కుక్కలకు అట్రాక్ట్ అవుతాయట. కాబట్టి మగ కుక్కులు రాకుండా చూసుకోవాలి. అయితే.. మీ కుక్కకు సాధారణం కంటే ఎక్కువ రుతుస్రావం ఉంటే.. పీరియడ్ డైపర్లు, ప్యాంటును ధరింపజేయవచ్చు. దీనివల్ల ఇల్లు మురికిగా ఉండదు, దుర్వాసన రాదు. అయితే ప్రతి 2-3 గంటలకు డైపర్ మార్చాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల చిరాకు, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి. ఆ సమయంలో కుక్కుల ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం కూడా ముఖ్యం. ఏదేమైనా మనుషులు చెప్పుకున్నట్లు కుక్కులు తమ బాధను చెప్పుకోలేవు కాబట్టి.. పెంచుకున్న వాళ్లే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 

Similar News