Flight Rule : తినే పదార్థమే కానీ.. విమానంలో తీసుకెళ్లనివ్వరు.. ఏమిటి?.. ఎందుకు?

అది అందరూ ఇష్టంగా తినే పదార్థమే. ఏ తీర్థ యాత్రలకు వెళ్లినా, ఆలయాలు సందర్శించినా లగేజీతోపాటు చాలా మంది దానిని తీసుకెళ్తుంటారు. శుభ కార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు.

Update: 2024-05-23 13:29 GMT

దిశ, ఫీచర్స్ : అది అందరూ ఇష్టంగా తినే పదార్థమే. ఏ తీర్థ యాత్రలకు వెళ్లినా, ఆలయాలు సందర్శించినా లగేజీతోపాటు చాలా మంది దానిని తీసుకెళ్తుంటారు. శుభ కార్యాల్లో ఎక్కువగా వాడుతుంటారు. దేవుడి ప్రసాదంగానూ ఉపయోగిస్తారు. కానీ విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రం దానిని వెంట తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎవరైనా తీసుకెళ్లినా వారిని విమానాశ్రయంలోకి, ఫ్లైట్‌లోకి అనుమతించరు. ఇంతకీ ఏమిటది అనుకుంటున్నారా?.. కొబ్బరి కాయ.

ఆకలి అయినప్పుడు తినడానికి ఇష్టమైన పండ్లు, కాయలు, స్నాక్స్ వంటివి తమ బ్యాగుల్లో తీసుకెళ్తుంటారు చాలామంది. కొంతమంది ఆరోగ్యానికి మంచిదని ఎక్కడికి వెళ్లినా పచ్చికొబ్బరి కాయను లేదా కొబ్బరి బోండాన్ని తీసుకెళ్తుంటారు. బస్సులు, ఇతర వాహనాల్లో అయితే పర్లేదు, కానీ విమానంలో మాత్రం కొబ్బరి కాయను తీసుకెళ్లడం నిషేధం. ఎందుకంటే.. కొబ్బరి బోండాంలోని తెల్లటి పదార్థంలో అంతర్లీనంగా ఉండే నూనెకు మండే స్వభావం ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో, వాతావరణ మార్పుల్లో ఏదైనా జరిగితే అది మంటల వ్యాప్తికి కారణం కావచ్చు.

కొబ్బరికి మండే గుణం ఎందుకు ఉంటుంది?

కొబ్బరిలోని నూనె పదార్థంలో లో ఫ్లాష్ పాయింట్స్ కలిగి ఉంటాయి. దీనివల్ల అవి సులభంగా మంటలకు గురవుతాయి. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. సహజంగానే నూనెలు హైడ్రో కార్బన్‌ పదార్థాలు కలిగి ఉంటాయి. ఇవి హైడ్రోజన్ అండ్ కార్బన్ అణువులతో కూడిన అణువులు. అందువల్ల నూనెను వేడి చేసినప్పుడు హైడ్రోకార్బన్ అణువులు శక్తిని పుంజుకుంటూ వేగంగా కదలడం ప్రారంభిస్తాయి. ఈ సందర్భంలో అవి పరస్పరం ఢీకొంటూ విడిపోతాయి. ఈ సందర్భంగా మరింత ఎక్కువగా రియాక్టివ్ అణువులను విడుదల అవుతాయి. కొబ్బరి కాయలో కూడా అంతర్లీనంగా హైడ్రోకార్బన్ అణువులు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా దాని ఫ్లాష్ పాయింట్‌కు మించి వేడి చేసినప్పుడు కొబ్బరి కాయలో నూనె రూపంలో దాగి ఉండే చమురును హైడ్రో కార్బన్ అణువులు మండిస్తాయి. దీనివల్ల మంటలు వ్యాపించి ప్రమాదం సంభవించవచ్చు.

ఎటువంటి సందర్భాల్లో ప్రమాదకరం?

చమురు లేదా నూనెకు సంబంధించిన ఫ్లాష్ పాయింట్ అనేది మంట లేదా స్పార్క్ వంటి జ్వలన మూలానికి గురైనప్పుడు మండించగల ఉష్ణోగ్రత క్రియేట్ అవుతుంది. కొబ్బరి నూనె 350°F నుండి 420°F (175°C నుండి 220°C) వరకు తక్కువ ఫ్లాష్ పాయింట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది మండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే విమానాల్లో క్యారీ ఆన్ లగేజీలో కొబ్బరి కాయ, నూనెతో సహా ఇతర ఏ నూనెలను కూడా అనుమతించరు. అగ్ని ప్రమాదాల జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా ఇలా చేస్తారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అసోసియేషన్ (IATA) లిక్విడ్స్, జెల్స్ సహా ఏరోసోల్స్‌ను క్యారీ - ఆన్ బ్యాగ్‌లలో తీసుకెళ్లడానికి అనుమతించవు.

Similar News