దీర్ఘకాలిక ఒత్తిడితో అధిక బరువు పెరుగుతారు.. ఎందుకో తెలుసా?

దీర్ఘకాలిక ఒత్తిడి (chronic stress) రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడాన్ని, స్థూలకాయాన్ని ఇది ఎలా ప్రోత్సహిస్తుందో ఒక అధ్యయనం వెల్లడించింది.

Update: 2023-06-11 06:48 GMT

దిశ, ఫీచర్స్: దీర్ఘకాలిక ఒత్తిడి (chronic stress) రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా బరువు పెరగడాన్ని, స్థూలకాయాన్ని ఇది ఎలా ప్రోత్సహిస్తుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తద్వారా ఒత్తిడితో కూడిన సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని ఎత్తిచూపింది. వాస్తవానికి స్ట్రెస్ అనేది మెదడులో జరిగే సహజ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఫలితంగా దీర్ఘ కాలిక ఒత్తిడికి గురైన వారు హెల్తీ ఫుడ్ తినడం తగ్గించేస్తారు. ఆశ్చర్యకరంగా తక్షణ, రుచికరమైన చిరుతిళ్లపై మొగ్గు చూపుతారు. మెదడులో జరిగే రసాయన ప్రక్రియవల్ల ఇది సంభవిస్తుంది.

ఫలితంగా వ్యక్తులు హై కేలరీల ‘కంఫర్ట్ ఫుడ్’‌ను ఇష్టపడుతుంటారు. అయితే పరిశోధకులు ఈ ప్రక్రియ మెదడులోని పార్శ్వ హాబెనులాలో(brain’s lateral habenula)జరిగుతుందని ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలో గుర్తించారు. ఈ పరిస్థితిని మార్చాలంటే.. తక్షణ రుచి, అవసరం కోసం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో కొంతకాలం తర్వాత బ్రెయిన్‌లో తక్షణ అవసరాలకోసం తినే చిరుతిళ్లపై మొగ్గుచూపే ‘పార్శ్య హాబెనులా’ పరిస్థితి మారిపోతుందని, జంక్ ఫుడ్ తినడంవల్ల కలిగే ఆనందాన్ని తగ్గించే సహజ మెదడు ప్రతిస్పందన పునరుద్ధరించబడుతుందని సిడ్నీలోని గార్వాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌‌లో విజిటింగ్ సైంటిస్ట్ హెర్బర్ట్ హెర్జోగ్ అన్నారు. అందుకే ఒత్తిడితో కూడిన సమయాల్లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. 

ఇవి కూడా చదవండి:

యాసిడ్ రిఫ్లక్స్‌తో గుండెల్లో మంట.. నివారణ కోసం ఇలా చేయండి  

మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?  

Tags:    

Similar News