సమ్మర్‌లో పిల్లలు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే.. తింటే ఏం జరుగుతుందంటే..

చిన్న పిల్లలు చాలా వరకు జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో ఐస్ క్రీములు, చాక్లెట్లు, వివిధ బేకరీ ఫుడ్స్ తింటుంటారు. కానీ వీటిలో ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు వంటివి ఉండవు.

Update: 2024-05-07 13:17 GMT

దిశ, ఫీచర్స్ : చిన్న పిల్లలు చాలా వరకు జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్ట పడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో ఐస్ క్రీములు, చాక్లెట్లు, వివిధ బేకరీ ఫుడ్స్ తింటుంటారు. కానీ వీటిలో ప్రోటీన్లు, ఫైబర్లు, విటమిన్లు వంటివి ఉండవు. పైగా షుగరింగ్, కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉంటాయి. దీంతో అవి సహజంగానే ఆరోగ్యానికి మంచిది కాదని, చిన్న పిల్లలు అస్సలు తిన కూడదని నిపుణులు చెప్తుంటారు. అయితే ఏయే జంక్ ఫుడ్స్‌ తినకూడదు. అందులో ఏముంటాయో తెలుసుకుందాం.

చిప్స్ ఇవి తినడానికి రుచిగానే ఉంటాయి. కానీ వాటిని కంటిన్యూస్‌గా పిల్లలకు తినిపిస్తుంటే మాత్రం ఒబేసిటీ, రక్త హీనత వంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. పైగా వీటిలో కొలెస్ట్రాల్, సోడియం, కేలరీస్ అధికంగా ఉంటాయి. ఇక ఇన్‌స్టండ్ నూడుల్స్ విషయానికి వస్తే వీటిలోనూ సోడియం ఎక్కువగా, పోషకాలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. పిల్లలు బాగా ఇష్టపడే పిజ్జాలో కూడా సాస్, చీజ్, సోడియం, చక్కెర ఎక్కువగా ఉంటాయి. తరచుగా తినడంవల్ల వీటిలోని కొవ్వులు శరీరంలో పేరుకుపోతాయి. దీంతో ఒబేసిటీ, కడుపునొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తుతాయి. ఇక బర్గర్లు హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అని తెలిసిందే. వీటిలో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ పదార్థాలు కలుపుతారు. ఎక్కువ కేలరీలను, కొవ్వులను కలిగి ఉంటాయి. వీటిని తినడంవల్ల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి. వీటితోపాటు ప్యాకేజ్డ్ ఫుడ్స్, బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ కూడా పిల్లలకు మంచిది కాదు. ఇవన్నీ అధిక బరువు సమస్యతోపాటు ఏజ్‌తో సంబంధం లేకుండా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌ను పెంచుతాయి. కాబట్టి అవైడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Similar News