మద్యం తాగే అలవాటుతో ఏకంగా లక్షలు సంపాదించాడు.. ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అంతేకాదు తాగుడుకు బానిసైతే కుటుంబ, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయని, సంబంధాలు నాశనం అవుతాయని పెద్దలు చెప్తూనే ఉంటారు.

Update: 2024-05-10 07:22 GMT

దిశ, ఫీచర్స్ : మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసిందే. అంతేకాదు తాగుడుకు బానిసైతే కుటుంబ, ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయని, సంబంధాలు నాశనం అవుతాయని పెద్దలు చెప్తూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరిగి మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. ప్రస్తుతం అదే జరిగింది. మద్యం సేవించే అలవాటువల్ల ఓ వ్యక్తి ఏకంగా ధనవంతుడై పోయాడు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

అతని పేరు నిక్‌‌ వెస్ట్.. వయస్సు 65 ఏండ్లు, బ్రిటన్ నివాసి. తన 16 ఏండ్ల వయస్సులో స్టాంపులు, కొత్త కొత్త వస్తువులు సేకరించే హాబిట్స్ కలిగి ఉండేవాడట. కానీ ఆ తర్వాత చెడు స్నేహాలవల్ల తాగుడుకు బానిసైన ఇతను గత 42 ఏండ్లుగా బీర్లు తాగుతూ, ఖాళీ బీర్ క్యాన్లను సేకరించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. దీంతో అతని ఇంట్లో మొత్తం 10,300 ఖాళీ క్యాన్లు పేరుకుపోయాయి. అయితే వీటిలో కొన్ని చాలా రేర్‌గా దొరికే అరుదైన, విలువైన క్యాన్లు కూడా ఉన్నాయి.

ఇంట్లో క్యాన్లు పేరుకుపోవడం, ప్లేస్ సరిపోకపోవడంతో నిక్ వెస్ట్ తన ఇంటిని వదిలి వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు. దీంతో ఎంతో కాలంగా పోగేసిన బీర్ క్యాన్లను విక్రయించాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే అతనికి అదృష్టం కలిసి వచ్చిందట. అతను జమచేసుకున్న ఖాళీ బీర్ క్యాన్లలో మొదటి ఆరువేల వరకు అమ్మగా 13500 డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో అయితే రూ. 14 లక్షలు వచ్చాయి. ఎందుకంటే ఆ క్యాన్లు చాలా ప్రత్యేకమైనవట. అలాగే ఇటలీలోని బీర్ క్యాన్ డీలర్లకు 18 వేల ఖాళీ క్యాన్లను అమ్మగా రూ. 10 లక్షల 43 వేల 526 ($12,500) వచ్చాయి. ఇక మరికొన్ని క్యాన్లను బ్రిటీష్ మ్యూజియం వాళ్లు కూడా ఇతని నుంచి కొనుగోలు చేశారట. దీంతో ఒకప్పుడు మద్యానికి బానిసైన నిక్‌ వెస్ట్ ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయాడు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కిక్కులో ఉండే వాడికి లక్కు దక్కడమంటే ఇదే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News