ఎండలో తిరిగొచ్చాక ఉక్కపోత భరించలేక స్నానం చేస్తున్నారా.. అయితే ప్రమాదమే?

తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Update: 2024-05-07 14:03 GMT

దిశ, ఫీచర్స్: తెలుగు రాష్ట్రాల్లో మార్చి నెల నుంచే తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మే నెలలో భానుడి భగభగలకు జనాలు విలవిలలాడుతున్నారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, చిన్నారులు మాత్రం ఇంట్లోనే ఉంటూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇక ఉద్యోగులు బయటకు రాక తప్పదు. కాబట్టి చల్లటి పానీయాలు, నీటి శాతం కలిగిన పండ్లు వెంట తీసుకొచ్చుకుంటూ వేసవి తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎండలు బాగా కొడుతుండటంతో ప్రజలు ఏసీ రూముల నుంచి బయటకు రావడం లేదు. అయితే కొందరు ఏదైనా పని ఉంటే బయటకు వచ్చి చెమటలు ఉక్కపోత భరించలేక ఇంటికి వెళ్లగానే కూల్ వాటర్ తాగడం లేదా స్నానం వంటివి చేస్తుంటారు. కానీ అలా చేయడం ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కూల్ వాటర్ తాగకూడదా?

* విపరీతమైన ఎండలో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కాసేపటి తర్వాత నీరు తాగడం మంచిది.

* అలాగే అలా చేయడం వల్ల ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉండవచ్చు.

చల్లటి నీటితో స్నానం చేయకూడదా?

* ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. అలా చేస్తే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

* చల్లటి నీరుతో స్నానం చేస్తే ఒక్కోసారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వంటివి కూడా వస్తాయి.

* ఎండలో శరీరమంతా చెమటతో నిండి పోయినప్పటికీ ఇంటికి వెళ్లగానే స్నానం చేయకుండా కాసేపు అయిన తర్వాత చేయాలి. లేదంటే ప్రమాదం అని నిపుణులు సలహా ఇస్తున్నారు.

నోట్: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తీసుకున్నవి. ఇవి కేవలం పాఠకుల అవగాహన కోసమే. దీనిని దిశ దృవీంకరించదు.

Similar News