కుక్కకు పట్టుచీర కట్టి భారీ లెవల్లో శ్రీమంతం.. అమ్మాయిలు కూడా ఈర్ష్యపడేలా ముస్తాబు! (వీడియో)

పెంపుడు జంతువులను కొంతమంది ఎంత ప్రేమ చూపుతారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.

Update: 2023-10-02 09:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెంపుడు జంతువులను కొంతమంది ఎంత ప్రేమ చూపుతారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా కుక్కలను అయితే చాలా మంది ఇష్టపడుతారు. ఇంట్లో ఒక మెంబర్‌లా ట్రీట్ చేస్తారు. కొంతమందైతే వాటితోనే తింటారు.. పడుకుంటారు. కుక్కలు విశ్వాసానికి ప్రతీకలు. యజమాని కోసం కుక్కలు ప్రాణాలు కూడా ఇస్తాయి. అంత నమ్మకంగా ఉంటాయి. అందుకే చాలా మంది ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటారు. అయితే తాజాగా ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకు శ్రీమంతం చేయడం నెటిజన్లను ఆశ్యర్యానికి గురిచేస్తుంది. యజమానులైన సిద్ధార్థ్ శివమ్ కుటుంబం గోల్డెన్ రిట్రీవర్ అనే డాగ్‌కు శ్రీమంతం చేశారు. తమ పెంపుడు కుక్క రోజీ గర్భం దాల్చి డెలివరీకి సమయం దగ్గరపడింది.

దీంతో యజమానులు.. ‘కుక్కకు బొట్టు పెట్టి, గాజులు తొడిగారు. పూలు దానిపై చల్లి, స్వీట్లు తినిపించారు. దానికి పట్టు చీర కూడా చుట్టారు. అలాగే దాని ముందు, ఐయామ్ రెడీ అనే బోర్డ్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వీక్షించినా జనాలు ఫిదా అయిపోతున్నారు. రోజీని రెడీ చేశాక ఎంతో చూడముచ్చటగా ఉండటంతో 1.7 లక్షల లైక్స్‌ రాగా.. మిలియన్ల కొద్ది వ్యూస్ రావడం విశేషం.‘కుక్కకు శ్రీమంతం చేయడం చాలా గొప్ప నిర్ణయమని కొంతమంది, సో క్యూట్ అని మరికొందరు రోజీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News