ఆరోగ్యానికి మంచిదని పచ్చి పాలు తాగుతున్నారా.. అయితే ప్రాణాలు డేంజర్‌లో పడ్డట్టే!

కొంతమంది డైట్‌ను పాటిస్తూ ఆహారాలను పచ్చిగా తింటుంటారు.

Update: 2024-05-24 14:03 GMT

దిశ, ఫీచర్స్: కొంతమంది డైట్‌ను పాటిస్తూ ఆహారాలను పచ్చిగా తింటుంటారు. అలాగే కొందరు గుడ్లు, పాలు ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఉదయం లేవగానే తాగుతారు. అయితే కొందరికి పాల వాసన కూడా పడకపోయినప్పటికీ ఆరోగ్యానికి మంచిదని చిన్నా పెద్ద బలవంతంగా తాగుతుంటారు. ఇక పల్లె టూర్లలో ఉండేవాళ్లు ఆవు, గేదె పాలు పితగానే డైరెక్ట్‌గా గ్లాస్‌లో పోసుకుని తాగేస్తారు. కానీ అలా తాగడం మంచిది కాదని ప్రాణాలకు హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి పాలు తాగితే.. అర్థరైటిస్, గులేయిన్, బారే సిండ్రోమ్, డిహైడ్రేషన్, వికారం, అతిసారం, వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చి ఇబ్బందులు పడే చాన్స్ ఉంది.

కాబట్టి పచ్చి పాలు పాశ్చరైజేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా తాగితే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అసలు పాశ్చరైజేషన్ అంటే ఏమిటంటే.. పాశ్చరైజేషన్ అనేది తక్కువ సమయంలోనే అధిక ఉష్ణోగ్రతలతో ద్రవాలను వేడి చేయడం. పాశ్చరైజేషన్ రుచి లేదా పోషక విలువలు ప్రభావితం చేయకుండా పాలలోని హానికరమైన సూక్ష్మజీవులను చంపుతుంది. అన్ని బ్యాక్టీరియాలను నాశనం చేయడం వల్ల వాటిని తాగితే పెద్దగా ప్రమాదం తలెత్తే అవకాశం లేనందున పాశ్చరైజేషన్ అయిన తర్వాతనే తాగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అయితే పచ్చిపాలలో అధికంగా యాంటీ మైక్రోబియల్ ఉండి పలు ఇన్ఫెక్షన్స్‌కు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉన్నందున బాగా మరిగించిన తర్వాత పాలు తాగాలి. ఇటీవల ఓ పరిశోధనలో.. పచ్చి పాలను తాగిన వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నట్లు పరిశోధకులు అంచనా వేశారు. అయితే వీరంతా క్షయ వ్యాధి బారిన పడి చనిపోయినట్లు సమాచారం. కాబట్టి ఆవు నుంచి డైరెక్ట్‌గా వచ్చిన పాలను తాగకుండా అందులోని బ్యాక్టీరియా నాశనం అయ్యే దాకా బాగా మరిగించి తాగాలని నిపుణులు అంటున్నారు.

Similar News