వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చిల్డ్ బీర్ తాగుతున్నారా.. స్టఫ్‌లో వీటిని తిన్నారో ఇగ అంతే సంగతి!

గత కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Update: 2024-05-08 13:36 GMT

దిశ, ఫీచర్స్: గత కొద్ది రోజుల నుంచి ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో చాలా మంది బయటకు రావాలంటేనే భయపడిపోతూ ఇంట్లోనే ఏసీ కింద సమయం గడుపుతున్నారు. అయితే అబ్బాయిలకు కాలు ఇంట్లో ఎక్కువ సేపు నిలవదు కాబట్టి ఎండకు తిరుగుతూ మధ్యాహ్నం కాగానే చిల్ అయ్యేందుకు ఫ్రెండ్స్‌తో చిల్డ్ బీర్ తాగి వేసవి తాపాన్ని తగ్గించుకుంటున్నారు. బీర్‌లో తక్కువ ఆల్కాహాల్ శాతం ఉండంటంతో టీనేజర్స్ సైతం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

కూల్ బీర్లు విపరీతంగా తాగడంతో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీర్ల స్టాక్ కూడా అయిపోయింది. దీంతో తాగుబోతు సంఘం అధ్యక్షుడు ఏకంగా ప్రభుత్వానికే లేఖ రాయడంతో రాష్ట్ర మంతటా చర్చానీయాంశంగా మారిపోయింది. అయితే కూల్ బీర్లు వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుండటంతో వాటి వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే బీర్ తాగేటప్పుడు కొందరు స్టఫ్‌లో పలు రకాల పదార్థాలు తింటుంటారు. ఎక్కువగా నాన్ వెజ్ పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చికెన్, మటన్, అప్లేట్స్ వంటివాటిలో మసాలా ఉపయోగించి మరీ తింటారు. కానీ అలాంటివి తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.

*మసాలాలు ఉపయోగించి చేసి చికెన్, మటన్ వంటివి బీర్ లేదా ఆల్కహాల్ తాగేటప్పుడు తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటివి వచ్చే ప్రమాదం ఉంది.

*అలాగే బ్రెడ్‌తో చేసినవి కూడా తినకూడదు. ఎందుకంటే.. అందులో ఈస్ట్ ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం బెటర్.

*ఇంకా కొంతమంది ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌ను బీర్ తాగేటప్పుడు స్టఫ్‌గా ఉపయోగిస్తుంటారు. కానీ వాటివల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే దాహాన్ని పెంచుతాయి.

* అయితే బీర్ తాగేటప్పుడు ఉప్పగా ఉండేవాటిని ఇష్టపడుతుంటారు. కానీ అవి డిహైడ్రేషన్ సమస్య వచ్చేలా చేస్తాయి. అలాగే ఎడీమా, హైబీపీని పెంచే అవకాశం కూడా ఉంది.

* బీర్‌లో పాటు డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇందులో ఉండే కెఫిన్, కొవ్వు పలు రకాల సమస్యలకు కారణం అవుతాయి.

* బీర్ తాగేటప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరగడంతో పాటుగా అధిక బరువు కూడా పెరుగుతారు. కాబట్టి పండ్లు, ఉడికించిన శనగలు, మొలకెత్తిన విత్తనాలు, గుడాలు వంటివి తినాలి.

Similar News