స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్ చేస్తున్న చిన్నారి.. మెదడు తినేసిన అమీబా?

స్మిమ్మింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మందికి స్విమ్ చేయడం ఇష్టం. మరీ ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు. చిన్న పిల్లలు తన అమ్మమ్మ, తాతయ్యల ఇంటి వద్దకు వెళ్లి స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మరి కొందరు స్విమ్మింగ్

Update: 2024-05-24 03:29 GMT

దిశ, ఫీచర్స్ : స్మిమ్మింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. చాలా మందికి స్విమ్ చేయడం ఇష్టం. మరీ ముఖ్యంగా సమ్మర్ వస్తే చాలు. చిన్న పిల్లలు తన అమ్మమ్మ, తాతయ్యల ఇంటి వద్దకు వెళ్లి స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మరి కొందరు స్విమ్మింగ్ ఫూల్స్‌కి వెళ్లి స్విమ్ నేర్చుకుంటారు. అయితే ఇలా స్విమ్మింగ్ కోసం వెళ్లిన ఓ ఐదేళ్ల చిన్నారి మరణించింది. అది ఎలా అనుకుంటున్నారా? ఆ పాప మెదడును అమీబా తినేసింది. అసలు విషయంలోకి వెళితే.. అయితే మనం చాలా సంఘటనలు చూస్తాం. ఈతకు వెళ్లి వచ్చిన తర్వాత చిన్నారి మృతి అనే ఘటనలు అనేకం. అయితే కేరళలో కూడా ఓ ఐదేళ్ల బాలిక మరణించింది. స్విమ్మింగ్ చేసి వచ్చిన బాలిక నేగ్లేరియా ఫాలెరీ అనే బ్రెయిన్ ఇన్ ఫెక్షన్‌తో మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే దీనిని మెదడు తినే అమీబా అంటారు. కాగా, దీని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడు తినే అమీబా లక్షణాలు

తలనొప్పి

వాంతులు

మోషన్స్

తల తిప్పడం

అధిక జ్వం, మెడ నొప్పి

ఈ ప్రమాదం అధికమైతే మూర్ఛ, మతిమరుపు , కోమాలోకి వెళ్లి చివరికి మరణించడం కూడా జరుగుతుందంట.

అయితే ఈ ఇన్ ఫెక్షన్ అనేది నీటి ద్వారా ముక్కులోకి చేరి మెదడుకు వెళ్తుంది. స్విమ్మింగ్ చేయడం వలన నీరు ముక్కులోకి వెళ్లి, ఈ వైరస్ మెదడుకు వ్యాపిస్తుంది అంటున్నారు వైద్యులు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఈ బ్రెయిన్ ఇన్ ఫెక్షన్ సోకిన వారిలో మరణాల రేటు 85 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడి అయ్యిందంట. అందువలన చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.పూల్స్, స్ప్లాష్ ప్యాడ్​లు, వాటర్​పార్క్​లలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. స్విమ్మింగ్ చేసే క్రమంలో క్లిప్స్ ఉపయోగించాలని చెబుతున్నారు.

Similar News