లవ్ బాంబ్ : ప్రేమ పేరుతో అతి చేస్తే అక్కడ కట్ చేయడమే..

మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. మీ పార్టనర్ లో ఉండాల్సిన క్వాలిటీస్ సెట్ చేసుకున్నారు అనుకుందాం. ఆ లక్షణాలు ఉంటేనే మ్యారేజ్ చేసుకుందామని

Update: 2024-04-28 10:37 GMT

దిశ, ఫీచర్స్: మీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. మీ పార్టనర్‌లో ఉండాల్సిన క్వాలిటీస్ సెట్ చేసుకున్నారు అనుకుందాం. ఆ లక్షణాలు ఉంటేనే మ్యారేజ్ చేసుకుందామని కలలు కంటున్నారు. ఈ టైంలో ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తే.. అచ్చం మీరు కోరుకున్నట్లుగా ప్రవర్తిస్తే.. మీరు వెంటనే వావ్ అనుకుంటారు.. ఎస్ చెప్తారు కదూ. కానీ అస్సలు అలా చేయొద్దని చెప్తున్నారు నిపుణులు. ఈ ప్రవర్తనను ‘లవ్ బాంబ్’ అంటారని.. అలాంటి వ్యక్తులను ‘లవ్ బాంబర్’ అని పిలుస్తారని హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని వరల్డ్ లోనే గొప్ప వ్యక్తిగా అనిపించేలా చేయడం, ప్రతిక్షణం హ్యాపీగా ఉంచేందుకు ప్రయత్నించడం, అందంగా ఉన్నారని పొగడటం.. ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తారు.ఇలా బుట్టలో వేసేందుకు ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదలకుండా ట్రై చేస్తారు. ఇదంతా చాలా ప్లాన్‌తో జరిగే పని అంటున్న నిపుణులు... జాగ్రత్తగా ఉండాలని టిప్స్ అందిస్తున్నారు. అలాంటి వాళ్ళను గుర్తించి ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తున్నారు.

లక్షణాలు

1. అటెన్షన్

మీరు రిలేషన్ షిప్‌లో ఉన్నారా? ఎప్పుడు మీకే ప్రాధాన్యత ఇవ్వబడుతుందా? చాలా త్వరగా ఇదంతా జరిగిపోతే మాత్రం ఆలోచించాల్సిందే. ఏ టైమ్‌లోనైనా మీకు మాత్రమే కాల్ చేస్తే.. మీతోనే స్పెండ్ చేయాలి అనుకుంటే.. అలాంటి వాళ్లు ఫ్రెండ్స్ లేకుండా ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నట్లే. అంటే వారితో ఎవరూ స్నేహం చేయకుండా ఉన్నట్లే..కాబట్టి క్యారెక్టర్ అనాలిసిస్ చేయాల్సిందే.

2. అవసరంలేని గిఫ్ట్స్

మీతో కనెక్షన్ పెంచుకునేందుకు, మీ అటెన్షన్ క్యాచ్ చేసేందుకు అవసరంలేని గిఫ్ట్స్ ఇస్తుంటారు.ప్రేమతో బహుమతులు ఇవ్వడం కరెక్టే కానీ టూ మచ్ అయితే మాత్రం లవ్ బాంబ్ వేస్తున్నట్లే. బహుశా ఈ గిఫ్ట్స్ బాగా ఎక్స్ పెన్సివ్ ఆయుండొచ్చు.. ఇది మీతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం కావచ్చు.

3. అర్థం పర్థం లేని ప్రామిస్

మిమ్మల్ని కలిసిన రెండు మూడు రోజులకే మీకు ఫ్యూచర్ గురించి వాగ్ధానాలు చేస్తున్నారా? మీ లైఫ్ స్టైల్, ఎయిమ్, వాల్యూస్ గురించి తెలుసుకోకుండానే పెళ్లి, పిల్లల వరకు వెళ్తే.. ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు అవాయిడ్ చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. మీకంటూ ప్రత్యేకమైన లైఫ్ ఉందని గుర్తుచేయాలని చెప్తున్నారు.

4. హద్దులను గౌరవించకపోవడం

ఏ విషయంలోనూ నో చెప్పడాన్ని యాక్సెప్ట్ చేయలేరు. బౌండరీస్‌కు రెస్పెక్ట్ ఇవ్వరు. ఈ టైంలో మాట వినకపోవడం, ఇష్టమొచ్చినట్లు చేస్తుండటమే కాదు ప్రతి విషయంలో చిరాకు పడటం గమనిస్తాం. అలాంటి వారితో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్.

నిజమైన ప్రేమకు తేడా??

‘లవ్ బాంబ్’ అనేది మానిప్యులేట్ చేసే వ్యూహం. ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ అన్నీ అధికంగా ఉంటాయి. కానీ కాలక్రమేణా తగ్గిపోతాయి. కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. అదే నిజమైన ప్రేమ అయితే.. అర్థం చేసుకునే తత్వం అధికంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఓపెన్‌గా డిస్కస్ చేస్తారు. భాగస్వామి ఎదుగుదలకు హెల్ప్ చేస్తారు. వ్యక్తిత్వానికి విలువ ఇస్తూ.. ఎమోషనల్ బాండింగ్ పెంచుకుంటారు.

ఎలా అవాయిడ్ చేయాలి?

* కొంచెం బ్రేక్ తీసుకుని మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.

* మీకు లవ్ బాంబ్ వేస్తున్నట్లు అనిపిస్తే.. ఈ ఇష్యూ డిస్కస్ చేసేందుకు ప్లాన్ చేయాలి.

* అంతకుముందు మీ రిలేషన్ ఎలా ఉంది? లవ్ బాంబింగ్‌తో మీ మైండ్, బాడీ ఫీలింగ్ ఏంటి అర్థం చేసుకోవాలి.

* అయినా సరే పర్సన్ రాంగ్ పర్పస్‌తో ఉన్నారు అనుకుంటే బౌండరీ సెట్ చేసి ఆచరణలో పెట్టాలి.

* ఈ పరిస్థితి మానసికంగా బాధ పెడుతుంటే.. దాని నుంచి బయటకు రాలేకపోతే.. థెరపిస్ట్ ను సంప్రదించాలి.

Read More...

ఆయనకు 80.. ఆమెకు 70.. ఓ వృద్ధ జంట వివాహం 





Similar News