మార్కెట్ లో మరో కొత్త రెసిపీ.. బర్గర్‌తో ఐస్‌క్రీం రోల్.. ఎలా చేశారో చూడండి..

స్ట్రీట్ ఫుడ్ ప్రియులు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రుచిని టేస్ట్ చేయాలనుకుంటారు.

Update: 2024-05-27 11:07 GMT

దిశ, ఫీచర్స్ : స్ట్రీట్ ఫుడ్ ప్రియులు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రుచిని టేస్ట్ చేయాలనుకుంటారు. దుకాణదారులు కూడా ప్రతిరోజూ వారి వంటకాలతో వివిధ ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. టేస్ట్ అదుర్స్ అనుకుంటూ కస్టమర్లు తెగ ఇష్టపడి తింటారు. దీంతో స్ట్రీట్ ఫుడ్ తయారీ దారులు కొత్త కొత్త రెసిపీలను తయారు చేస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న ఓ ప్రబుద్ధుడు టమోటాతో ఐస్ క్రీం రోల్ చేస్తే ఇప్పుడు ఓ వ్యక్తి బర్గర్‌తో ఐస్‌క్రీం రోల్‌ను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన ప్రజలు బర్గర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు !

ఐస్‌క్రీమ్ రోల్ అనేది మార్కెట్‌లో మంచి కాన్సెప్ట్. దీన్ని చాలామంది పబ్లిక్ కూడా ఇష్టపడతారు. దీన్ని బేస్ చేసుకున్న వ్యాపారస్తులు వివిధ రకాల ఐస్ క్రీం రోల్ ను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్గర్ తో ఐస్ క్రీమ్ రోల్ తయారు చేశారు.

ఆ వ్యక్తి ముందుగా బర్గర్‌లో కొంత భాగాన్ని చల్లటి ప్లేస్ లో పెట్టారు. దానికి పాలు జోడించి, రెండింటినీ కలిపి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. దీని తరువాత, అతను అదే చల్లని ఉపరితలం పై బర్గర్ పేస్ట్‌ను వ్యాప్తి చేశాడు. కొన్ని సెకన్ల తర్వాత, దానిని రోల్ రూపంలో స్క్రాప్ చేశాడు. చివరికి, ఆ చిన్న రోల్స్ టమోటా, ఉల్లిపాయలతో ఒక కప్పులో సర్వ్ చేశాడు. బర్గర్ రోల్ చేసిన ఈ వీడియో (@mumbaikarfoodie__) అనే ఫుడ్ బ్లాగర్ ద్వారా Instagramలో పోస్ట్ చేశారు.

Tags:    

Similar News