మనిషి ఆలోచనలను పసిగట్టేస్తున్న మెషిన్.. ఏమనుకుంటున్నారో రాసి ఇచ్చేస్తుంది కూడా..

మనిషి ఆలోచనలను పసిగట్టేస్తున్న మెషిన్ ను తయారు చేశారు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.

Update: 2024-05-26 09:08 GMT

దిశ, ఫీచర్స్: మనిషి ఆలోచనలను పసిగట్టేస్తున్న మెషిన్ ను తయారు చేశారు కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. 79శాతం ఖచ్చితత్వంతో ఆలోచనలు చెప్పేస్తున్న మెషిన్.. వీటిని టెక్స్ట్ రూపంలో కూడా కన్వర్ట్ చేస్తుండటం విశేషం. కాగా మరొకరి బ్రెయిన్ రీడ్ చేయడం మ్యాజికల్, సూపర్ నేచురల్ అనిపించొచ్చు కానీ సైంటిఫిక్ గా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సైంటిస్టులు. ఈ పరిశోధన బ్రెయిన్ - కంప్యూటర్ ఇంటర్ ఫేజ్ ప్రాముఖ్యతను వివరిస్తుండగా.. మనుషులు మెషిన్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మార్చేస్తుంది.

ఈ ప్రయోగంలో భాగంగా ఇద్దరు పార్టిసిపెంట్స్ బ్రెయిన్స్ లో సర్జరీ ద్వారా చిన్న ఎలక్ట్రోడ్ లను అమర్చారు శాస్త్రవేత్తలు. వారు మనసులో ఏమనుకుంటున్నారో సైలెంట్ గా చెప్పాలని కోరారు. ఈ క్రమంలో మెషిన్ వారి మాటలను డీకోడ్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రారంభ దశలోనే ఉందని.. కేవలం ఆరు పదాలకు మాత్రమే పరిమితం అయిందని తెలిపారు.

ఇక ఈ ఎక్స్ పరిమెంట్ లో ముందుగా వాలంటీర్లకు స్క్రీన్ పై కొన్ని పదాలను చూసిన శాస్త్రవేత్తలు.. వాటిని మనసులో ఫీల్ అవమని సూచించారు. మూడు రోజులు ఒకే పదాన్ని రిపీట్ చేయమని కోరారు. ఇదంతా పూర్తిగా అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత కంప్యూటర్ మోడల్ ను ఉపయోగించి బ్రెయిన్ యాక్టివిటీ ప్యాటర్న్ డిటెక్ట్ చేశారు. అలా మనసులోని ఆలోచనలను డికోడ్ చేశారు.

Similar News