ఎల్జీ ట్రై అండ్ బై ఆఫర్.. 7 రోజులు ఉచితంగా మొబైల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ మొబైల్.. యూజర్ల కోసం ఓ సూపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎల్జీ జీ8ఎక్స్ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు 7 రోజుల పాటు (జూన్ 1 నుంచి జూన్ 14 వరకు) ఉచితంగా వాడుకోవచ్చు. ఏడు రోజులపాటు వాడిన తరువాత నచ్చితే మొబైల్‌ను కొనుక్కోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే తిరిగిచ్చేయొచ్చు. కానీ, ఫోన్‌కు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. 18 ఏళ్ల పైబడిన వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకోసం క్రెడిట్ కార్డుతో […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్జీ మొబైల్.. యూజర్ల కోసం ఓ సూపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఎల్జీ జీ8ఎక్స్ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్లు 7 రోజుల పాటు (జూన్ 1 నుంచి జూన్ 14 వరకు) ఉచితంగా వాడుకోవచ్చు. ఏడు రోజులపాటు వాడిన తరువాత నచ్చితే మొబైల్‌ను కొనుక్కోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే తిరిగిచ్చేయొచ్చు. కానీ, ఫోన్‌కు ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు. 18 ఏళ్ల పైబడిన వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇందుకోసం క్రెడిట్ కార్డుతో 99 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఫోన్ తిరిగివ్వగానే డబ్బులు రిటర్న్ ఇస్తారు. ఇక ఎల్జీ అందిస్తున్న ఈ ఆఫర్‌ను పొందాలంటే కస్టమర్లు ముందుగా తమకు సమీపంలోని స్టోర్‌ను ఎంచుకుని ఎల్జీ వెబ్సైట్ (https://www.lg.com/in/tryandbuy-mobile/register)లో తమ పేరు, కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్ పంపాలి. దీంతో యూజర్‌కు ఒక ప్రమోషన్ కోడ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. తరువాత స్టోర్ వద్ద ఓ ఫామ్‌ను ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 49,999/- ధర గల ఈ ఫోన్ 2019లో లాంచ్ అయ్యింది.
ఫీచర్స్ :
డిస్ప్లే : 6.4 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855
ర్యామ్ : 6జీబీ
ఇంటర్నల్ మెమొరీ : 128 జీబీ ( మైక్రో ఎస్డీ కార్డుతో 2 టీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు)
ఓఎస్ : ఆండ్రాయడ్ 9.0
బ్యాటరీ : 4000 ఎమ్ఏ హెచ్
ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
రేర్ కెమెరా : 12ఎంపీ + 13 ఎంపీ