మనవడిని పరిచయం చేసిన TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యారు. ఆయన కుమార్తె నైమిషా రెడ్డి పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది.

Update: 2023-04-09 13:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యారు. ఆయన కుమార్తె నైమిషా రెడ్డి పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన ఇంట మనవడు జన్మించాడన్న విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు. "నా చిన్న కూతురు నైమిషా గతవారం మగబిడ్డను ప్రసవించింది. బిడ్డకు, తల్లికి మీ అందరి దీవెనలు కావాలి" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు, మనవడి ఫొటోను కూడా పంచుకున్నారు.

Tags:    

Similar News