నా క్షేమం కోరిన మీకు కృతజ్ఞతలు

దిశ, పటాన్‌చెరు: అమీన్ పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ బిజిలీ రాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజిలీ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మరి దరి చేరకుండా తనవంతు సాయంగా కాలనీ ప్రజలకు మాస్కులను పంపిణీ చేశామన్నారు. తన క్షేమం కోరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వార్డు ప్రజలకు ఎలవేళలా అందుబాటులో ఉంటూ సహాయ […]

Update: 2020-07-27 02:58 GMT

దిశ, పటాన్‌చెరు: అమీన్ పూర్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ బిజిలీ రాజు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సోమవారం స్థానిక ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజిలీ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మరి దరి చేరకుండా తనవంతు సాయంగా కాలనీ ప్రజలకు మాస్కులను పంపిణీ చేశామన్నారు.

తన క్షేమం కోరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వార్డు ప్రజలకు ఎలవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి సహకారంతో కాలనీలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Tags:    

Similar News