భూ కబ్జా వ్యవహారం.. సోదరుడిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

దిశ, నల్లగొండ: వంశపారం పర్యంగా వచ్చిన తమ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ భూమిని కాపాడాలని నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలానికి చెందిన బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు దేవరబోయిన కిృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. చింతలపాలెం శివారు గోడుమరక గ్రామంలో సర్వేనెంబర్ 222/83,222/55లో తమ తండ్రినుంచి వారసత్వంగా నాలుగెకరాల భూమి వచ్చిందని, అట్టి భూమిని తన సోదరుడు […]

Update: 2021-09-06 06:32 GMT

దిశ, నల్లగొండ: వంశపారం పర్యంగా వచ్చిన తమ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ భూమిని కాపాడాలని నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలానికి చెందిన బాధితులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు దేవరబోయిన కిృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. చింతలపాలెం శివారు గోడుమరక గ్రామంలో సర్వేనెంబర్ 222/83,222/55లో తమ తండ్రినుంచి వారసత్వంగా నాలుగెకరాల భూమి వచ్చిందని, అట్టి భూమిని తన సోదరుడు దేవరకోయిన కోటయ్య దౌర్జన్యంగా కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే, వాళ్లు కూడా తమనే బెదిరిస్తున్నారని కిృష్ణయ్య ఆరోపించారు. దీంతో చేసేదేం లేక కలెక్టర్‌ను కలవడానికి వచ్చామని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు.

Tags:    

Similar News