తెలంగాణలో లాక్‌డౌన్ విధించాల్సిందే

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా సెకండ్ భయంకరంగా విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందుబాటులో లేక రోజురోజుకూ కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి అడ్డుకోవాలంటే రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడమే మార్గమని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించడంలో […]

Update: 2021-05-09 20:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా సెకండ్ భయంకరంగా విజృంభిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందుబాటులో లేక రోజురోజుకూ కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి అడ్డుకోవాలంటే రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడమే మార్గమని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అంతేగాకుండా.. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. కరోనా విజృంభిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

Tags:    

Similar News