రేషన్ బియ్యం, మాస్కులు పంపిణీ

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు తెల్లరేషన్ కార్డుదారులకు 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో ప్రారంభించారు. అలాగే, మాస్కులూ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరమే పరిష్కారం అని తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాలే తెలంగాణకు శ్రీరామరక్ష అని వెల్లడించారు. అలాగే, నిరుపేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందనీ, […]

Update: 2020-04-03 04:49 GMT

దిశ, మహబూబ్ నగర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు తెల్లరేషన్ కార్డుదారులకు 12కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో ప్రారంభించారు. అలాగే, మాస్కులూ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరమే పరిష్కారం అని తెలిపారు. సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయాలే తెలంగాణకు శ్రీరామరక్ష అని వెల్లడించారు. అలాగే, నిరుపేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందనీ, అందులో భాగంగానే ప్రస్తుతం 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తుందని, త్వరలోనే రూ.1500 నగదూ అందజేయనుందని వెల్లడించారు.

tags: corona, rice distribution, masks, kollapur mla beeram harshavardhan reddy, social distance,

Tags:    

Similar News